FactCheck : పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అలాంటి వెల్కమ్ లభించిందా?

భారత్‌లో జరగనున్న ICC ODI ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారీ భద్రత మధ్య పాకిస్థాన్ క్రికెట్ జట్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2023 11:21 AM GMT
FactCheck : పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అలాంటి వెల్కమ్ లభించిందా?

భారత్‌లో జరగనున్న ICC ODI ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు భారీ భద్రత మధ్య పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెప్టెంబర్ 27 రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే.. ఆ జట్టుకు వ్యతిరేకంగా 'పాకిస్తాన్ ముర్దాబాద్' అనే నినాదాలు చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

“Pakistan Murdabad chants were raised when Pakistan teππorist team arrived in Bharat… (sic)” అంటూ పెట్టిన పోస్టుకు 50000 కు పైగా వ్యూస్ వచ్చాయి.

పలువురు ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కూడా వైరల్ అవుతున్నాయి.

నిజ నిర్ధారణ :

ఒరిజినల్ వీడియోకు పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేసిన ఆడియోను యాడ్ చేశారని మేము గుర్తించాం.

పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వ్యక్తుల ఆడియోను జోడించారని వైరల్ వీడియో డాక్టరైనట్లు న్యూస్ మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. మేము 1.55 నిమిషాల నిడివి ఉన్న వీడియోను కనుగొన్నాము. విమానాశ్రయంలో పాకిస్తాన్ ఆటగాళ్లకు వెల్కమ్ చెప్పే అదే విజువల్స్‌ను సెప్టెంబర్ 27న వార్తా సంస్థ ANI ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. మేము పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలను వినలేదు. కొందరు అభిమానులు పాకిస్తాన్ కెప్టెన్‌ను 'బాబర్ భాయ్' అని పిలిచారు.

"తెలంగాణ: అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది." అంటూ పలువురు పోస్టులు పెట్టారు.

హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయటికి వస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన అనే వీడియోలను కూడా మేము కనుగొన్నాము. మేము ఈ వీడియోలలో కూడా పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేసిన ఉదంతాన్ని కనుగొనలేకపోయాము. వైరల్ వీడియో ఎడిటింగ్ చేశారని నిర్ధారించాం.

మేము RGI ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లోని పోలీస్ అధికారి ఆర్ శ్రీనివాస్‌ను సంప్రదించాము. హైదరాబాద్ విమానాశ్రయంలో పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు ఎవరూ చేయలేదని న్యూస్‌మీటర్‌కు ధృవీకరించారు. ఒక అమెరికా పౌరుడు “పాకిస్తాన్ జీతేగా” అని నినాదాలు చేశాడని తెలిపారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా భారతదేశంలో పాకిస్థాన్ జట్టును సాదరంగా ఆహ్వానించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా తెలిపింది.

వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఎటువంటి నినాదాలు చేయలేదు.

Credits : Md Mahfooz Alam

Claim Review:పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అలాంటి వెల్కమ్ లభించిందా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story