ఒక కరాటే మ్యాచ్ కు సంబంధించిన వీడియోను యూజర్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కరాటే మ్యాచ్ లో భాగంగా అవతలి వ్యక్తిని తన్నగా.. అతడు కిందకు పడిపోవడం చూడొచ్చు.
ఇంతలో కింద పడిపోయిన వ్యక్తి మీద ఇజ్రాయెల్ పతాకం ఉంది. గెలిచిన వ్యక్తి మీద పాకిస్తాన్ జెండా కనిపించింది. ఒలింపిక్స్ లో పాకిస్తాన్ ఇజ్రాయెల్ ను కరాటే ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో ఓడించింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తూ ఉన్నాయి. ఇది నిజమేనని నమ్మి పలువురు షేర్ చేస్తూ వస్తున్నారు.
https://www.facebook.com/groups/204984490264100/posts/980199912742550
https://www.facebook.com/groups/538403446756326/posts/923851724878161
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ మ్యాచ్ టోక్యో ఒలింపిక్స్ లో చోటు చేసుకోలేదు. అక్కడ పోరాడిన ఆటగాళ్లు ఇజ్రాయెల్ కు కానీ, పాకిస్తాన్ కు కానీ చెందిన వాళ్లు కాదు.
న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో మే 21, 2021న అప్లోడ్ చేశారు. వీడియో లోని స్కోర్ కార్డు పైన 'Russian Federation', 'Montenegro' 'European Senior Championship' అనే పదాలను గమనించవచ్చు.
ఈ సమాచారాన్ని బట్టి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో 56వ యూరోపియన్ కరాటే ఫెడరేషన్ కు సంబంధించిన వీడియో అని తెలుస్తోంది. క్రొయేషియాలో మే 2021లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించారు. 'World Karate Federation' తమ యూట్యూబ్ ఛానల్ లో ఈ మ్యాచ్ ను టెలికాస్ట్ చేసింది. వైరల్ అవుతున్న క్లిప్ 1 నిమిషం 45 సెకండ్ల వద్ద చూడొచ్చు. పోటీ పడిన రెండు జట్లు రష్యా, మోంటెనెగ్రో అని స్పష్టంగా తెలుస్తోంది.
పాకిస్తాన్ 1992 తర్వాత ఒలింపిక్స్ లో ఒక్క మెడల్ కూడా సంపాదించలేదు. 1992 బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ లో పాకిస్తాన్ ఆఖరి సారిగా ఒలింపిక్ మెడల్ గెలిచింది. టోక్యో 2020 లో పాక్ కు ఎటువంటి పతకం దక్కలేదు.
https://nocpakistan.org/newmedaltally.php?pid=4#goto
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. పాకిస్తాన్ కరాటే ఛాంపియన్ షిప్ లో ఇజ్రాయెల్ ను ఓడించలేదు.