FactCheck : బహ్రెయిన్ రాజధాని మనామాలో ఇజ్రాయెల్ ఎంబసీకి నిప్పు పెట్టారా?
ఇజ్రాయెలీ-హమాస్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. బహ్రెయిన్ రాజధాని మనామాలోని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Oct 2023 9:15 PM ISTఇజ్రాయెలీ-హమాస్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. బహ్రెయిన్ రాజధాని మనామాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి ప్రజలు మంటపెడుతూ ఉన్నారని ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ప్రజలు భవనాన్ని తగలబెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒక X ప్రీమియం వినియోగదారు ఈ వీడియోను “బహ్రెయిన్ ప్రజలు మనామాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించారు." అంటూ వీడియోను షేర్ చేశారు. “People of Bahrain tried to burn the Israeli embassy in Manama. (sic)” He also used hashtags such as “#IsrealPalestineconflict #IsraelAttack.” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
చాలా మంది ట్విట్టర్, ఫేస్ బుక్ వినియోగదారులు కూడా అదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
వీడియోలోని సంఘటనకు ప్రస్తుత ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణతో ఎటువంటి సంబంధం లేదని NewsMeter కనుగొంది. 2012లో బహ్రెయిన్‌లోని సితారాలో ప్రజలు పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించినది.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. నవంబర్ 7, 2012న Occupy Bahrain అనే ఖాతా ద్వారా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాం. అగ్నిప్రమాదం జరిగిన ఘటనకు సంబంధిచి అదే భవనం వీడియోను మేము కనుగొన్నాము. వీడియోలో నిప్పంటించిన భవనం ఒక పోలీసు స్టేషన్ అని తేలింది.
మేము డిసెంబర్ 30, 2012న RevolutionBahrain అనే ధృవీకరించిన ఛానెల్ ప్రచురించిన వీడియో పొడవైన సంస్కరణను YouTubeలో కనుగొన్నాము. వైరల్ క్లిప్ 0.59-సెకన్ల టైమ్‌స్టాంప్‌లో కనిపిస్తుంది.
నవంబర్ 3, 2012న బహ్రెయిన్ రాజధాని మనామాలోని సితారా పోలీస్ స్టేషన్‌పై నిరసనకారులు దాడి చేస్తున్నట్లు వీడియోలో ఉందని వివరణ ద్వారా తెలుస్తోంది. అల్-ఖలిఫియా జైలులో హసన్ ముషై ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఈ దాడి జరిగిందని అందులో పేర్కొన్నారు.
యునైటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ నవంబర్ 5, 2012న వార్తా నివేదికలో, సితార పోలీస్ స్టేషన్‌పై కొంతమంది దాడి చేశారని తెలిపారు.
అందువల్ల, బహ్రెయిన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని తగలబెట్టిన వీడియో ఇది కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam