2024 జూలై 4న కైర్ స్టార్మర్ UK ప్రధాన మంత్రి అయ్యారు. ఈ మధ్య, ఒక బార్ యజమాని బ్రిటీష్ ప్రధానిని పబ్ నుండి బయటకు గెంటేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అయ్యింది.
ఒక X వినియోగదారు వీడియోను, “వావ్!! బార్ యజమాని బ్రిటీష్ ప్రధానిని పబ్ నుండి బయటకు గెంటేశాడు. (sic)” అంటూ పోస్టు చేశాడు.
పలు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ‘The First’ అనే ఎక్స్ అకౌంట్ లో ఏప్రిల్ 20, 2021న వీడియోను పోస్ట్ చేశారని తెలుసుకున్నాం. “INTENSE: UK bar owner kicks out pro-lockdown politician. That man is not allowed in my pub! Get out of my pub!” అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
లాక్ డౌన్ పొలిటీషియన్ ను యూకేకు చెందిన బార్ ఓనర్ బయటకు గెంటేసాడంటూ ఆ వీడియోలో తెలిపారు. రాజకీయ నాయకుడిని బార్ ఓనర్ తన పబ్ లోకి అడుగుపెట్టనివ్వలేదంటూ ఆ పోస్టులో తెలిపారు.
వైరల్ వీడియో ఇటీవలిది కాదని అన్నారు. 2021లో, బోరిస్ జాన్సన్ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. కైర్ స్టార్మర్ ఇటీవల ప్రధాని అయ్యారు.
కీవర్డ్ సెర్చ్ చేయగా.. ఇండిపెండెంట్ ద్వారా జూలై 9, 2021 న ‘కీర్ స్టార్‌మర్ ను బాత్ పబ్ నుండి ఆ యజమాని బయటకు పంపించేశాడు’ అనే నివేదికను మేము గమనించాం.
నివేదిక ప్రకారం, లేబర్ పార్టీ లీడర్ సర్ కీర్ స్టార్‌మర్‌ను బాత్ పబ్ నుండి బయటకు పంపించేశారు. లాక్డౌన్ కు వెతిరేకంగా.. పబ్ యజమాని విమర్శలు చేస్తూ వచ్చాడు. కోవిడ్ -19 లాక్ డౌన్ సమయంలో ప్రతిపక్ష రాజకీయవేత్త సర్ కీర్ స్టార్‌మర్‌ను నిందించాడు.
ఏప్రిల్ 19, 2021 నాటి BBC కి సంబంధించిన మరొక నివేదికను మేము కనుగొన్నాము. 'Starmer thrown out of Bath pub in lockdown row,' అనే శీర్షికతో, లేబర్ లీడర్‌ను తన ఎన్నికల ప్రచార సమయంలో పబ్ నుండి బయటకు వెళ్లమని కోరినట్లు పేర్కొంది.
ప్రస్తుత బ్రిటన్ ప్రధానిని పబ్ నుంచి తరిమికొట్టారనే వాదన తప్పుదారి పట్టించేది. వీడియో పాతది. 2021లో జరిగిన సంఘటనను చూపుతుంది. ఆ సమయంలో కైర్ స్టార్మర్ ప్రధానమంత్రి కాదు.