గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు హార్దిక్ పటేల్‌ను ప్రజలు తరిమికొట్టారనే వాదనతో సోషల్ మీడియాలో వీడియో షేర్ అవుతోంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది.
ఒక ట్విటర్ యూజర్ వీడియోను షేర్ చేస్తూ, "బీజేపీ నాయకుడు హార్దిక్ పటేల్‌ను ప్రజలు తరిమికొట్టారు. గుజరాత్ ప్రజలు బీజేపీపై చాలా కోపంగా ఉన్నారు" అని రాశారు.
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
పలువురు ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేశారు. (పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.)
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. ధృవీకరించబడిన ఛానెల్ VTV గుజరాతీ న్యూస్ 2019లో అప్లోడ్ చేసిన అదే వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మనం చూడవచ్చు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో స్థానికులు పటేల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నట్లు వీడియో శీర్షిక పేర్కొంది.
"అహ్మదాబాద్‌లోని ప్రహ్లాద్‌నగర్ గార్డెన్‌లో మార్నింగ్ వాక్ కు వచ్చిన వాళ్లు హార్దిక్ పటేల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు" అనే శీర్షికతో 2019లో మరో యూట్యూబ్ ఛానెల్ అదే వీడియోను ప్రచురించింది. "Hardik Patel grilled by morning walkers in Ahmedabad's Prahladnagar garden."
ఆ వీడియో డిస్క్రిప్షన్ లో "Congress leader Hardik Patel and another Congress leader Alpesh Thakor were at Prahladnagar garden in the western part of Ahmedabad to give a TV interview to Gujarati news channel TV9 Gujarati when morning walkers present choose to confront Hardik Patel and asked him questions and hurled barbs." అని ఉంది. (అప్పటి కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్, మరో కాంగ్రెస్ నాయకుడు అల్పేష్ ఠాకోర్ అహ్మదాబాద్ పశ్చిమ భాగంలోని ప్రహ్లాద్‌నగర్ గార్డెన్‌లో గుజరాతీ న్యూస్ ఛానెల్ TV9 గుజరాతీకి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఉండగా, ఉదయం పూట వాకింగ్ చేసేవారు హార్దిక్ పటేల్ పై ఎన్నో ప్రశ్నలు కురిపించారు.)
హార్దిక్ పటేల్ 2022 జూన్‌లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి, 'ఒక సైనికుడు'గా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పని చేయాలని కోరుకుంటున్నానని చెప్పి బీజేపీలో చేరారు.
హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నప్పటి ఈ వీడియో పాతదని స్పష్టమవుతోంది. కాబట్టి, వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.