FactCheck : బైకర్ ను ఫాలో చేసి అధికారులు పట్టేసుకున్న ఘటన ఇటీవల శ్రీనగర్ లో చోటు చేసుకోలేదు

Old video from brazil shared as terrorist caught in srinagar. భద్రతా సిబ్బంది వాహనాల నుండి బయటకు వచ్చిన అధికారులు ఒక బైకర్‌ను వెంబడించడంతో పాటు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 July 2023 9:15 AM GMT
FactCheck : బైకర్ ను ఫాలో చేసి అధికారులు పట్టేసుకున్న ఘటన ఇటీవల శ్రీనగర్ లో చోటు చేసుకోలేదు

భద్రతా సిబ్బంది వాహనాల నుండి బయటకు వచ్చిన అధికారులు ఒక బైకర్‌ను వెంబడించడంతో పాటు.. వాహనం నుండి దిగి వచ్చి బైకర్‌ను తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్‌కు చెందినదని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. I_krishd అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ ఇండియన్ పోలీస్ ఆఫీసర్‌కి సెల్యూట్ చేయండి.. అతని ధైర్యం, అద్భుతమైన కిక్‌కి సెల్యూట్ చేయండి. అతనే నిజమైన హీరో.. అంటూ పోస్టు పెట్టారు.

I_krishd అనే అకౌంట్ లో “Salute this Indian police officer and his courage and fabulous kick. He is the real hero. #Terrorist caught in #SriNagar, #Kashmir” ఇలా పోస్టు పెట్టారు.

పలువురు యూజర్లు కూడా ఇదే వాదనతో వీడియోను షేర్ చేశారు. కశ్మీర్ లోని శ్రీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ :

వీడియో శ్రీనగర్‌లోనిదా.. కాదా.. అని నిర్ధారించుకోవడానికి, NewsMeter బృందం శ్రీనగర్‌లో తీవ్రవాది/ఉగ్రవాది అరెస్టుకు సంబంధించి తెలుసుకుందామని కీ వర్డ్స్ తో గూగుల్ సెర్చ్ నిర్వహించింది. అందుకు సంబంధించిన ఇటీవలి అప్‌డేట్ ఏదీ కనుగొనబడలేదు. మేము వైరల్ వీడియోను కీఫ్రేమ్‌లుగా విభజించాము. కొన్ని కీఫ్రేమ్‌లతో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము.

finofilipino.org అనే వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 14, 2022 నాటి స్పానిష్ భాషలోని శీర్షిక ‘Los policias brasileños no se andan con chiquitas’ కింద ప్రచురించబడిన ఒక వీడియోను గుర్తించాం. ఇది ‘బ్రెజిలియన్ పోలీసు అధికారులు చిన్నారులతో గొడవ పెట్టుకోరు’ అనే అర్థం వస్తుందని తెలిసింది. ఈ వీడియో పాతదని.. బ్రెజిల్ లో చోటు చేసుకుందని తెలిసింది. ముఖ్యంగా శ్రీనగర్ కు సంబంధించింది కాదని నిర్ధారించాం.

మా పరిశోధనను కొనసాగించగా.. డైలీ మోషన్ లో మేము అదే వీడియోను కనుగొన్నాము క్యాప్షన్‌లో ‘After police pursuit, teenager collided motorcycle against PM viatura and fell into the car, and ended up arrested’ అని ఉంది. ఈ వీడియోను రెండు సంవత్సరాల కింద అప్లోడ్ చేశారని మేము గుర్తించాం.

మేము కీవర్డ్స్ ను ఉపయోగించి Google సెర్చ్ ను నిర్వహించాము. అదే వీడియోను కలిగి ఉన్న 2 ఆగస్టు, 2021 నాటి obemdito-com నివేదికను మేము కనుగొన్నాము.

బ్రెజిల్ డౌన్‌టౌన్ పెరోలాలో ఒక యువకుడు తన మోటార్‌సైకిల్‌పై నుండి పడిపోయిన తర్వాత పోలీసులు దాడి చేశారని చెప్పుకొచ్చారు. పోలీసు కారును ఢీకొట్టాక అతడు పారిపోవాలని అనుకోగా.. పోలీసులు అడ్డుకోవడం సోషల్ మీడియాలో వీడియో అవుతున్న వీడియో చూపిస్తుంది. పోలీసు కారును ఢీకొట్టిన తర్వాత, అతను పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ మిలిటరీ పోలీసు (PM) బృందాలు అతనిని అడ్డుకున్నాయని నివేదిక పేర్కొంది.

ముగింపు:

వైరల్ వీడియో బ్రెజిల్‌కు చెందినది.. జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ కు సంబంధించినదని కాదని మేము నిర్ధారించాము.

Credits : Abrar Bhat




Claim Review:బైకర్ ను ఫాలో చేసి అధికారులు పట్టేసుకున్న ఘటన ఇటీవల శ్రీనగర్ లో చోటు చేసుకోలేదు
Claimed By:Social media users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter/Facebook
Claim Fact Check:False
Next Story