శిథిలాలలో చిక్కుకున్న ఓ వ్యక్తి పక్కన కుక్క కూర్చున్న చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. వాటిని షేర్ చేస్తున్న వ్యక్తులు ఇటీవల టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపానికి ఫోటోను లింక్ చేస్తున్నారు.
ఒక ట్విట్టర్ వినియోగదారు చిత్రాన్ని పంచుకున్నారు. ఇలా వ్రాశారు, “ఈ ఫోటో ఈ రోజు టర్కీలో తీశారు. రెస్క్యూ కుక్కలు ఒకరు శిథిలాల కింద కనుగొన్నాయి" అని తెలిపారు.
అనేక మంది Facebook, Twitter, Instagram వినియోగదారులు అదే దావాతో చిత్రాన్ని పంచుకున్నారు. ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖులు కూడా ఈ వైరల్ పోస్టులు షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
చిత్రం 2018 నాటిదని న్యూస్‌మీటర్ కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, అది 18 అక్టోబర్ 2018న ఇమేజ్ స్టాక్ వెబ్‌సైట్ అలమీలో ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. “భూకంపం తర్వాత శిథిలావస్థలో ఉన్న గాయపడిన వ్యక్తుల కోసం వెతుకుతున్న కుక్క” అనే శీర్షిక ఉంది.
చిత్రం జరోస్లావ్ నోస్కాకు క్రెడిట్ చేశారు.
iStock 2019లో చిత్రాన్ని ప్రచురించింది. దానిని జరోస్లావ్ నోస్కా తీశారంటూ క్రెడిట్ ను ఇచ్చింది.
Getty Images జెట్టి ఇమేజెస్ కూడా చిత్రాన్ని ప్రచురించింది. లొకేషన్ చెక్ రిపబ్లిక్ అని పేర్కొంది.
NewsMeter చిత్రం ఒరిజినల్ గా ఎక్కడ తీశారో అనే విషయాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. చిత్రం 2018 నుండి ఇంటర్నెట్‌లో ఉందని మేము కనుగొన్నాము. అందువల్ల, ఈ చిత్రం ఇటీవలి టర్కీ-సిరియా భూకంపం సమయంలో తీసినది కాదని, దావా తప్పు అని మేము నిర్ధారించాము.