ఐపీఎల్-2023 ఫైనల్ ఇటీవలే ముగిసింది. ఛాంపియన్ గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ ఏకంగా మూడు రోజులు సాగింది. అహ్మదాబాద్ లో వర్షం కారణంగా ఫైనల్ ను అనుకున్న రోజున నిర్వహించలేకపోయారు. రిజర్వ్ డే నాడు మ్యాచ్ ను నిర్వహించినా.. తర్వాత రోజు కూడా కొనసాగింది.
హెయిర్‌డ్రైయర్‌లు, ఐరన్ బాక్స్ లతో పిచ్ ను డ్రై చేస్తున్నట్లుగా సోషల్ మీడియా వినియోగదారులు రెండు చిత్రాలను షేర్ చేస్తున్నారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఇలా పిచ్ ను డ్రై చేశారని.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)ని విమర్శిస్తూ వినియోగదారులు పోస్టులు పెట్టారు.
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో గుజరాత్ టైటాన్స్ (జిటి) మరియు చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ GTపై ఐదు వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. ఐదవ టైటిల్‌ను గెలుచుకుంది.
నిజ నిర్ధారణ :
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వి అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదు. చాలా వరకూ వైరల్ ఫోటోలు ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ కు సంబంధించినవి కావు.
ఈ చిత్రాలు 2020 నాటివని.. అస్సాంలోని గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో గ్రౌండ్స్ మెన్ పిచ్‌ను ఆరబెట్టడాన్ని ప్రయత్నించారని న్యూస్‌మీటర్ కనుగొంది.
జనవరి 5, 2020న, ESPN Cricinfo ఇలాంటి చిత్రాన్ని ట్వీట్ చేసింది. గౌహతిలో పిచ్‌ను ఆరబెట్టడానికి హెయిర్‌డ్రైయర్‌లు, ఐరన్ బాక్స్, వాక్యూమ్ క్లీనర్‌ల వంటి వస్తువులను ఉపయోగించినట్లు తెలిపింది.
ఈ వైరల్ చిత్రాలు 2020 నాటివని, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 2023 IPL ఫైనల్‌లో పిచ్ ను ఈ పద్ధతుల్లో ఆరబెట్టడానికి ప్రయత్నించలేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam