కొన్ని రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేపట్టిన రైతుల ఉద్యమం రిపబ్లిక్ డే నాడు హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. రైతులతో పాటూ పోలీసులు కూడా గాయపడిన వారిలో ఉన్నారు.
ఈ ఘటనలకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆరోజు నుండి వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే కొన్ని ఫోటోలను చూసి ఢిల్లీలో ఇంత విధ్వంసం జరిగిందా అని మనకు అనిపించకమానదు.
కార్లను తగులబడి పోతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోలకు రిపబ్లిక్ డే నాడు రైతులు చేసిన ధర్నాలో చోటు చేసుకున్న హింసకు ఎటువంటి సంబంధం లేదని న్యూస్ మీటర్ తెలుసుకుంది. ఈ ఫోటోలో 2019లో జమ్మూలో చోటు చేసుకున్న హింసకు సంబంధించినవి.
ఈ ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఫేస్ బుక్ లో ఫిబ్రవరి 2019న పోస్టులు పట్టారు. జమ్మూలోని గుజ్జర్ నగర్ లో నిరసనకారులు వాహనాలను తగులబెడుతున్న ఘటనకు సంబంధించిన ఫోటోలని తెలుస్తోంది.
ఈ సమాచారాన్ని బట్టి గూగుల్ లో సెర్చ్ చేయగా.. పలు మీడియా సంస్థలు ఈ విషయాన్నే వెల్లడించాయి. జమ్మూలో 2019లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది గాయాలపాలవ్వగా.. 80కి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. అందులో ఎనిమిది వాహనాలకు నిప్పు పెట్టారు.
శుక్రవారం నాడు జమ్మూ నగరం గుజ్జర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నాడు ముస్లింల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ విధ్వంసం చోటు చేసుకుంది.
the QUINT లో కూడా 2019 లో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. పుల్వామా ఘటన చోటు చేసుకున్న ఒక రోజు తర్వాత ఈ విధ్వంసం జరిగింది. ఈ ఫోటోలు 2019 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.