చిన్నారిని ఓ వ్యక్తి దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ముస్లిం వ్యక్తి తన పొరుగింటి హిందువు బిడ్డపై దాడికి పాల్పడినట్లు ఆ వీడియోలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒక ట్విటర్ వినియోగదారు వీడియోను షేర్ చేసి , “కొన్ని అత్యవసర పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక హిందువు తన కొడుకును పొరుగింట్లో ఉన్న ముస్లిం వద్ద వదిలి వెళ్ళాడు. అతడు పిల్లవాడిపై దాడి చేసి, అల్లా అని చెప్పమని బలవంతం చేశాడు." అంటూ పోస్టులు పెట్టారు.
ఇదే క్లెయిమ్‌ను మరో ట్విట్టర్ యూజర్ కూడా చేశారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో పాకిస్థాన్‌కు చెందినదని, ఇందులో మతపరమైన కోణం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా.. 8 జూలై 2022న ట్విట్టర్ వినియోగదారు ట్వీట్ చేసిన వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను మేము కనుగొన్నాము. ఆ వీడియో పాకిస్తాన్‌లోని కరాచీలోని ఒరంగీ నుండి వచ్చినదని ఆమె చెప్పారు.
దీని నుండి క్యూ తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. 6 జూలై 2022న పాకిస్తాన్ కు చెందిన జియో టీవీ ప్రచురించిన నివేదికలో వీడియో నుండి స్టిల్స్‌ని కనుగొన్నాము. వైరల్ వీడియో కరాచీలోని ఒరంగీ టౌన్ ప్రాంతానికి చెందినదని, అతడి తండ్రి హింసిస్తున్నట్లు చూపుతున్నట్లు పేర్కొంది. తండ్రిని నిద్ర నుండి లేపినందుకు అతని 8 ఏళ్ల కొడుకును విపరీతంగా కొట్టాడు. దీంతో చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని (తండ్రి) అరెస్టు చేశారు.
పాకిస్థాన్‌కు చెందిన ఆరీ టీవీ కూడా 6 జూలై 2022న ఈ సంఘటనను నివేదించింది. అందుకు సంబంధించిన వైరల్ వీడియోను ప్రచురించింది. ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఇస్మాయిల్ తన ఎనిమిదేళ్ల కుమారుడిని చిత్రహింసలకు గురిచేశాడని అందులో పేర్కొంది. వైరల్ వీడియోను చిన్నారి తల్లి జమీలా చిత్రీకరించారని, కరాచీలోని ఒరంగీ టౌన్‌లో ఈ ఘటన జరిగిందని నివేదిక పేర్కొంది.
తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఇస్మాయిల్‌ను కరాచీ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆరీ టీవీ మరో కథనంలో పేర్కొంది.
6 జూలై 2022న కరాచీ పోలీసులు చేసిన ట్వీట్‌ను కూడా మేము కనుగొన్నాము. నిందితుడు ఇస్మాయిల్ ఔల్ద్ ఇబ్రహీంను అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం దర్యాప్తు అధికారులకు అప్పగించారు.
పిల్లాడిపై దాడికి సంబంధించిన వీడియో పాకిస్థాన్‌కు చెందినదని, ఇందులో మతపరమైన కోణం లేదని స్పష్టమైంది. ఒక ముస్లిం వ్యక్తి పొరుగింట్లో ఉన్న తన హిందువుల బిడ్డపై దాడి చేసినట్లు వీడియో చూపిందనే వాదన తప్పు అని మేము నిర్ధారించాము.