రతన్ టాటా మరణం తర్వాత, టాటా ట్రస్ట్ నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి పునర్నిర్మాణాన్ని ప్రారంభించినట్లు 'India.com' నివేదించింది. బాహ్య కన్సల్టెంట్లపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో CFO, COO పాత్రలను తొలగించారు.
ఈ పరిణామాల మధ్య, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై రతన్ టాటా చిత్రం, పేరును ప్రదర్శించడం ద్వారా UAE ఆయన్ను గౌరవించిందని పేర్కొంటూ ఒక వైరల్ చిత్రం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది.
కొందరు వినియోగదారులు ఈ చిత్రాన్ని పోస్ట్ చేసి “దుబాయ్ లో రతన్ టాటా చిత్రాన్ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం ద్వారా ఆయనకి గౌరవం ఇచ్చారు.” అంటూ చెప్పుకొచ్చారు.
రతన్ టాటా పేరు, ఫోటోతో కూడిన బుర్జ్ ఖలీఫా రాత్రిపూట పూర్తిగా వెలుగుతున్నట్లు ఆ చిత్రం చూపిస్తుంది.
ఇలాంటి పోస్ట్‌లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
నిజ నిర్ధారణ :
మా బృందం వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. చిత్రాన్ని డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా మెక్‌లారెన్ ఇంజనీరింగ్ గ్రూప్ అనే వెబ్‌సైట్ కనిపించింది. ఇక్కడ బుర్జ్ ఖలీఫా LED లైట్ డిస్‌ప్లేకు సంబంధించిన అసలు చిత్రం కనుగొన్నాం.
ముఖ్యంగా, ఈ చిత్రంలో రతన్ టాటా పేరు లేదా చిత్రం లేదు. మెక్‌లారెన్ ఇంజినీరింగ్ గ్రూప్ ప్రకారం, 2018లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఈ లైట్ షో నెలకొల్పింది. భవనం వెలుపలి భాగంలో అధునాతన LED స్ట్రిప్ సిస్టమ్‌నుకనుగొన్నాం. కానీ రతన్ టాటాకు ఎటువంటి సంబంధం లేదు.
అంతేకాకుండా, ఒక Pinterest వినియోగదారు టాటా ఫోటో లేకుండా బుర్జ్ ఖలీఫా సారూప్య చిత్రాన్ని కూడా పోస్ట్ చేసారు. ఇది వైరల్ చిత్రాన్ని ఎడిట్ చేశారనే వాస్తవాన్ని సూచిస్తుంది.
తదుపరి కీవర్డ్ సెర్చ్ లో బ్రిటానికా వెబ్‌సైట్ కనిపించింది. ఇందులో రతన్ టాటా జీవిత చరిత్ర ఉంది.
ఈ పేజీ వైరల్ ఇమేజ్‌లో కనిపించే టాటాకు సంబంధించిన అదే ఫోటో కూడా ఉంది. ఇక్కడ రతన్ టాటా నానో కారు పక్కన నిలబడి ఉన్నాడు. ఫోటో “సౌరభ్ దాస్/AP/Shutterstock.com”కి క్రెడిట్ ఇచ్చారు.
ఇదే చిత్రం వైరల్ పోస్ట్‌లో బుర్జ్ ఖలీఫాపై ఉంచిన ఫోటోతో సరిపోలినట్లు కనుగొన్నాం. ఇది మానిప్యులేట్ వెర్షన్ అని స్పష్టంగా తెలుస్తోంది.
అదనంగా, StudySection 2020లో అదే చిత్రంతో ఒక కథనాన్ని ప్రచురించింది, వైరల్ చిత్రం ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
దీన్ని మరింత ధృవీకరించడానికి, అధికారిక బుర్జ్ ఖలీఫా సోషల్ మీడియా ఖాతాలలో రతన్ టాటాకు ఎలాంటి నివాళి పోస్ట్‌లు లేవు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అధికారిక పేజీల ప్రకారం, అక్టోబర్‌లో బుర్జ్ ఖలీఫా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌కు మద్దతుగా మాత్రమే వెలిగింది.
అలాగే, టాటాకు బుర్జ్ ఖలీఫా వద్ద నివాళి ఇచ్చారని, ఏ ప్రసిద్ధ వార్తా సంస్థలు కనిపించలేదు.
బుర్జ్ ఖలీఫాపై రతన్ టాటాకు గౌరవం దక్కిందన్న వాదన తప్పు. వైరల్ ఇమేజ్ పాత చిత్రాలను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. ఇందుకు సంబంధించి టాటాకు చెందిన ప్రసిద్ధ ఫోటోను ఉపయోగించారని తెలుస్తోంది. దానిని బుర్జ్ ఖలీఫాపై ఉంచారు.
Credits : Sibahathulla Sakib