ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటవుట్ లో 4-2 తేడాతో నెగ్గింది. పెనాల్టీ షూటవుట్ లో అర్జెంటీనా విజయాన్ని అందుకుని.. టైటిల్ ను ముద్దాడింది. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా తొలి అర్ధభాగంలో రెండు గోల్స్ కొట్టింది. కానీ మరికాసేపట్లో ద్వితీయార్ధం ముగస్తుందనగా ఫ్రాన్స్ ఫార్వర్డ్ కిలియన్ ఎంబాపే నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టడంతో ఫ్రాన్స్ 2-2తో సమం చేసింది. నిర్ణీత సమయం వరకు అదే స్కోరు కొనసాగడంతో మ్యాచ్ ఎక్స్ ట్రా టైమ్ లోకి ప్రవేశించింది. మెస్సీ గోల్ తో అర్జెంటీనా 3-2తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత ఫ్రాన్స్ కు పెనాల్టీ కిక్ లభించింది. ఎంబాపే ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్ పోస్టులోకి పంపడంతో స్కోరు 3-3తో సమమైంది. దాంతో పెనాల్టీ షూటవుట్ ను నిర్వహించారు. పెనాల్టీ షూటవుట్లో అర్జెంటీనా ఆటగాళ్లు వరుసగా 4 సార్లు గోల్ పోస్టులోకి బంతిని తరలించగా, ఫ్రాన్స్ రెండు సార్లు విఫలమైంది. వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనాకు మూడో టైటిల్ దక్కింది. ఆ జట్టు గతంలో 1978, 1986లో ప్రపంచవిజేతగా నిలిచింది.
పోర్చుగీస్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో తన స్నేహితురాలు జార్జినా రోడ్రిగ్జ్, కొడుకుతో కలిసి ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. ఖతార్‌లో అర్జెంటీనా- ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో తీసిన ఫోటో అని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.
క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకో చేతిలో ఓడి పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఫ్యాక్ట్ చెకింగ్ :
వైరల్ ఇమేజ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను NewsMeter చేసింది. 2018లో గెట్టి ఇమేజెస్‌లో అప్‌లోడ్ చేయబడిన ఒరిజినల్ ఇమేజ్ ని మేము గుర్తించాం. జువెంటస్- BSC యంగ్ బాయ్స్ మధ్య UEFA ఛాంపియన్స్ లీగ్‌లో గ్రూప్ హెచ్ మ్యాచ్‌ను జార్జినా రోడ్రిగ్జ్, క్రిస్టియానో రొనాల్డో చూస్తున్నారు. అక్టోబరు 2, 2018న ఇటలీలోని టురిన్‌లోని అలియాంజ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది." అని ఉంది. ఫోటో కింద "Georgina Rodriguez and Cristiano Ronaldo look during the Group H match of the UEFA Champions League between Juventus and BSC Young Boys at Allianz Stadium on October 2, 2018 in Turin, Italy." అని ఉంది.
ఇదే ఈవెంట్ నుండి అనేక ఇతర చిత్రాలను గెట్టి వెబ్ సైట్ లో 2 అక్టోబర్ 2018న అప్‌లోడ్ చేసారు.
వైరల్ చిత్రం 2018 నాటిది.. ఖతార్‌లో జరిగిన FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్స్ కు సంబంధించినది కాదని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న దావా తప్పు.