Fact Check : నైట్ కర్ఫ్యూ మొదలవ్వగానే ప్రజలపై పోలీసులు తెలంగాణలో ప్రతాపం చూపించారు అంటూ వైరల్ అవుతున్న వీడియోలు..!

Fact Check of Thrashed During Night Curfew In Telangana.హైదరాబాద్ పోలీసులు రాత్రి పూట రోడ్లపై తిరుగుతున్న వారిని కొడుతూ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు.

By Medi Samrat  Published on  21 April 2021 12:55 PM GMT
fact check of thrashing in night curfew

ఏప్రిల్ 20 నుండి తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో పోలీసులు ప్రజలను కొడుతూ ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు రాత్రి పూట రోడ్లపై తిరుగుతున్న వారిని కొడుతూ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు.

"Opening shot today night curfew in Hyderabad." అంటూ వీడియోను వైరల్ చేయడం మొదలుపెట్టారు.

"HYDERABAD CITY POLICE in Action on Curfew Night" అంటూ ఇంకొందరు వీడియోలను పోస్టు చేయడం మొదలుపెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ వీడియోలన్నీ పాతవి.

2020 లాక్ డౌన్ కు చెందిన వీడియోలను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం మొదలుపెట్టారు.

వైరల్ అవుతున్న వీడియోలను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అవి 2020 మార్చి నెలకు చెందినవని తెలిసింది. 2020లో మార్చి నెలలో ఈ వీడియోను పోస్టు చేశారు.

"One more video-4 of Hyderabad police beating Citizens at Qilwat for violations, Maybe they are wrong but who gave police powers to use force on Citizens...? @TelanganaCMO @KTRTRS @TelanganaDGP @KTRoffice @hydcitypolice @CPHydCity (sic)." అంటూ అప్పట్లో పోలీసులు ప్రజలను కొట్టిన వీడియోలను అప్లోడ్ చేశారు.

outlookhindi.com లో కూడా మార్చి 2020న ఇదే వీడియోను షేర్ చేశారు. వీడియోను ఎక్కడ నుండి తీసుకున్నారో పూర్తీ సమాచారం అందలేదు కానీ.. గతంలో పలు ఫేస్ బుక్ పేజీలలో "Osman Bagh kamatipura ps bahadurpyra me lockdown curfew ke douran" అంటూ 2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో పోస్టు చేశారు.

రాత్రి తొమ్మిది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రజలపై పోలీసులు లాఠీలు ఝళిపించారంటూ ఓ యూట్యూబ్ చానల్‌ పలు వీడియోలను పోస్టు చేసింది. ఇందులో ప్రజలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నట్టు ఉంది. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆ వీడియోలు పోస్టు చేసిన చానల్ రిపోర్టరుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్టు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలు ఇప్పటివి కావు. ఇప్పుడు చోటు చేసుకుంది అంటూ వీడియోలను వైరల్ చేస్తే అధికారులు కఠిన చర్యలను తీసుకుంటున్నారు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.


Claim Review:నైట్ కర్ఫ్యూ మొదలవ్వగానే ప్రజలపై పోలీసులు తెలంగాణలో ప్రతాపం చూపించారు అంటూ వైరల్ అవుతున్న వీడియోలు..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story