తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతూనే ఉన్నందున, ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధిస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

అందుకు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

నిజ నిర్ధారణ :

తెలంగాణలో లాక్ డౌన్ కు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు.

ఓమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించబడదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మూడో వేవ్ గా భావించబడుతున్న ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట కర్ఫ్యూ మరియు లాక్‌డౌన్ ఉండదని మేము ఇప్పటికే చెప్పాము, మేము మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాము. .సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review :   తెలంగాణలో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిందా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story