FactCheck : ఇన్‌స్టాగ్రాంను భారత్ లో బ్యాన్ చేయబోతున్నారా?

No Instagram is not getting banned in India. ఇన్‌స్టాగ్రామ్ కు ఎంతో మంది అడిక్ట్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2023 12:29 PM GMT
FactCheck : ఇన్‌స్టాగ్రాంను భారత్ లో బ్యాన్ చేయబోతున్నారా?

ఇన్‌స్టాగ్రామ్ కు ఎంతో మంది అడిక్ట్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే..! యువతకు అదొక వ్యసనంగా మారిపోతూ ఉంది. ఇన్స్టా లో వచ్చే కంటెంట్ ప్రతికూల ప్రభావం చూపుతున్న కారణంగా భారత్ లో నిషేధం విధిస్తున్నట్లుగా పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. జూన్ 17 నాటి ఫస్ట్ ఇండియా న్యూస్ ఛానెల్ స్క్రీన్‌షాట్‌ను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేశారు.


టీనేజర్లపై ఇన్‌స్టాగ్రామ్ దుష్ప్రభావాల కారణంగా ప్రభుత్వం వచ్చే మూడు రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధించబోతోందని స్క్రీన్‌షాట్ లో ఉంది. ప్రపంచంలో అత్యధిక యూజర్లు కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది చందాదారులను కలిగి ఉంది.

నిజ నిర్ధారణ :

NewsMeter ఈ వాదనలో ఎటువంటి నిజం లేదని గుర్తించింది.

మేము వెబ్‌లో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించడం ద్వారా మా పరిశోధనను ప్రారంభించాము. అయితే ఇన్‌స్టాగ్రామ్ పై నిషేధం అంటూ విశ్వసనీయమైన మీడియా నివేదిక ఏదీ కనుగొనలేకపోయాము. మెటా యాజమాన్యంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్లలో Instagram ఒకటి. భారతదేశంలో నిషేధం విధిస్తే మాత్రం ఆ వార్త ఖచ్చితంగా మీడియా దృష్టిని ఆకర్షించేది. ఓ సంచలనమయ్యేది. కానీ అలాంటిదేమీ జరగలేదని మీడియా ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది.

నిషేధం గురించి ఏవైనా లీడ్‌లను కనుగొనడానికి మేము మెటా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించగా.. అందులో మాకు ఎటువంటి వివరం కనిపించలేదు. భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ పై బ్యాన్ విధించినట్లు ఎటువంటి సమాచారం దొరకలేదు.

అంతేకాకుండా, Android కోసం Google Play Storeలో , iOS కోసం Apple App Storeలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి Instagram అప్లికేషన్ ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఇక మొబైల్ ఫోన్లలో కూడా అప్లికేషన్ బాగా రన్ అవుతుంది.

ఫస్ట్ ఇండియా న్యూస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వైరల్ పోస్టుకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ సంబంధిత ట్వీట్‌ని కనుగొన్నాము. ఆ ట్వీట్‌లో, “ఫస్ట్ ఇండియా డిజిటల్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్లేట్ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది. ‘బ్రేకింగ్ న్యూస్’ ప్లేట్‌ను ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది." అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌ ను భారత్ లో బ్యాన్ చేస్తూ ఎటువంటి కథనాన్ని కూడా ప్రచారం చేయలేదని ఫస్ట్ ఇండియా తెలిపింది. ఈ ఫేక్ పోస్టును సృష్టించిన వారిపై తాము లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఫస్ట్ ఇండియా న్యూస్ టీమ్ తెలిపింది.

అందువల్ల, భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం లేదని NewsMeter బృందం స్పష్టంగా చెబుతోంది. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది.

Credits : Sunanda Naik



Claim Review:ఇన్‌స్టాగ్రాంను భారత్ లో బ్యాన్ చేయబోతున్నారా?
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story