Fact Check : భారత్ గెలిచినందుకు ఆసీస్ కోచ్ జస్టిన్ లంగర్ కు అంత కోపం వచ్చిందా..?

No, India's win is not responsible for Justin Langer's anger. భారత్ గెలిచినందుకు ఆసీస్ కోచ్ జస్టిన్ లంగర్ కు అంత కోపం వచ్చిందా.

By Medi Samrat
Published on : 24 Jan 2021 9:06 AM IST

fact check of cricket news

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు 2-1తో సొంతం చేసుకుంది. ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. సమిష్టిగా రాణించి భారత్ గెలుపును అందుకుంది. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో 32 సంవత్సరాలుగా ఓటమంటూ ఎరుగని ఆసీస్ కు భారత జట్టు పరాజయాన్ని రుచి చూపించింది.



ఈ మ్యాచ్ ఓడిపోయాక ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ కోపంతో వెళ్ళిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్ లో లాంగర్ కోపంతో క్యాప్ ను తీసేసి డస్ట్ బిన్ మీద ఆగ్రహాన్ని చూపించాడు. ఆ తర్వాత తనే ఆ డస్ట్ బిన్ ను తిరిగి పెట్టేశాడు.



"Priceless reaction from Aussie coach after losing the match." మ్యాచ్ ఓడిపోయాక జస్టిన్ లాంగర్ రియాక్షన్ ఇదంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇది భారత్ తో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చోటు చేసుకుందంటూ పలువురు చెబుతూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

జస్టిన్ లాంగర్ కోపంగా డస్ట్ బిన్ ను తగ్గిన ఘటన భారత్ తో గబ్బాలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు కాదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ లో సెర్చ్ చేయగా ఏప్రిల్ 20కి సంబంధించిన ట్వీట్ లింక్ దొరికింది. అందులో "Cant's stop re-watching when Justin Langer hoofs a bin in complete vein-bulging fury at Nathan Lyon's butterfingers at Headingley... and then very responsibly picks up the rubbish." రాసుకుని వచ్చారు. కోపాన్ని ప్రదర్శించిన లాంగర్ చెత్త బుట్టను తన్నేశాడని.. ఆ తర్వాత కింద పడిపోయిన చెత్తబుట్టను అక్కడే పడేశాడు అంటూ ట్వీట్ లో చెప్పుకొచ్చారు.



ఈ ట్వీట్ కు బట్టి.. "Justin Langer kicks dust bin" అనే కీవర్డ్స్ ను ఉపయోగించగా.. ఈ ఘటన హెడింగ్లేలో జరిగిందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ దేశాల మధ్య మ్యాచ్ జరిగిన అనంతరం ఇలా కోపాన్ని ప్రదర్శించాడు. నాథన్ లయాన్ క్యాచ్ ను పట్టకపోవడంతో ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ ను ఓడిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో ఇది.

అమెజాన్ డాక్యుమెంటరీ సిరీస్ 'ది టెస్ట్' కోసం ఈ వీడియోను రికార్డు చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో స్పోర్ట్ ప్రమోషన్ వీడియోలో కూడా దీన్ని చూడొచ్చు.

https://twitter.com/primevideosport/status/1241669448341356


ఈ వీడియో భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కంటే ముందే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాబట్టి జస్టిన్ లాంగర్ గబ్బాలో భారత్ గెలవగానే ఇలా కోపాన్ని ప్రదర్శించాడు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


Claim Review:భారత్ గెలిచినందుకు ఆసీస్ కోచ్ జస్టిన్ లంగర్ కు అంత కోపం వచ్చిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story