భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌద్ధమతాన్ని స్వీకరించాడని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నాడు. బౌద్ధ సన్యాసి తరహాలో ధోని ఉన్న ఫోటో సాయాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో ధోని గుండుతో కనిపిస్తూ ఉన్నాడు.


'ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌద్ధమతాన్ని స్వీకరించాడు' అంటూ పలువురు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ధోని బౌద్ధ మతాన్ని స్వీకరించలేదు.

ఈ వైరల్ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ట్విట్టర్ లో స్టార్ స్పోర్ట్స్ ఇండియా అప్లోడ్ చేసిన వీడియోను గమనించవచ్చు. మార్చి 14, 2021న ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఏప్రిల్ నెలలో ఐపీఎల్ మొదలుకాబోతూ ఉండడంతో అందుకు సంబంధించిన ప్రోమోల కోసం ధోని ఈ అవతారం ఎత్తాడు.

మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ యాడ్ కోసం గుండుతో కనిపించబోతున్నాడంటూ పలు మీడియా సంస్థలు కథనాలను రాశాయి. మొదట ధోని గుండు చేయించుకున్నాడని భావించగా.. అయితే అది మేకప్ అని తర్వాత తెలిసింది.

ఈ వీడియో ఇప్పటికే టీవీ ఛానల్స్ లో కూడా టెలీకాస్ట్ అవుతోంది. ఒక్కో ఐపీఎల్ కెప్టెన్ గురించి ధోని ఇంట్రడక్షన్ ఇస్తూ వస్తున్న యాడ్స్ ను స్టార్ స్పోర్ట్స్ తయారు చేసింది. గుండుతో ధోని కనిపించే వీడియో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చెప్పే వీడియో..! యూట్యూబ్, ట్విట్టర్ లో కూడా ఈ వీడియోను చూడొచ్చు.

ధోని బౌద్ధమతం స్వీకరించాడంటూ వైరల్ అవుతున్న పోస్టులపై ఆయన సన్నిహితులు మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ధోని గుండుతో కనిపించింది కేవలం ఒక యాడ్ కోసమేనని చెప్పుకొచ్చారు.

ధోని బౌద్ధ మతాన్ని స్వీకరించాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ వైరల్ ఫోటో స్టార్ స్పోర్ట్స్ యాడ్ కు సంబంధించినది.


Claim Review :   ధోని బౌద్ధమతాన్ని స్వీకరించాడా..?
Claimed By :  Twitter Users
Fact Check :  False

సామ్రాట్

Next Story