గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వంట మనిషి శివ ప్రసాద్ (29) ను సెప్టెంబరు 15న స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ షేక్ అమీర్ కత్తితో పొడిచి చంపాడు.
కెవిఎస్ భాస్కర్ నివాసంలో శివ గత ఎనిమిది నెలలుగా వంట మనిషిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబరు 8న, భాస్కర్ బంధువు సాయిశ్రీ బంజారాహిల్స్‌లోని ఒక దుకాణం నుండి స్విగ్గీలో స్వీట్స్ ఆర్డర్ చేశాడు. డెలివరీ ఏజెంట్ అమీర్ అడ్రెస్ ను చేరుకోలేకపోయాడు. ఆర్డర్ రెండు గంటలు ఆలస్యమైంది. అపార్ట్ మెంట్ కు చేరుకున్న అమీర్ శివతో గొడవ పడ్డాడు. కూరగాయలు కోసే కత్తితో శివపై అమీర్ దాడి చేశాడు. అమీర్ అక్కడి నుంచి పరారైనప్పటికీ శివకు తీవ్ర గాయాలయ్యాయి.
శివ మరణం తరువాత, ఈ సంఘటనలో మతపరమైన కోణం ఉందనే ప్రచారం సాగుతూ ఉంది.
ధృవీకరించబడిన ట్విట్టర్ వినియోగదారు 'అరుణ్ పుదూర్' ఈ సంఘటనకు మతపరమైన కోణాన్ని సృష్టించారు. మీడియా హంతకుడి పేరును దాచిపెట్టిందని ఆరోపించారు. అంతేకాకుండా ఒక స్విగ్గీ కస్టమర్ "ముస్లిం డెలివరీ వ్యక్తిని పంపించవద్దు" అని చెప్పిన మరొక సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
పోస్ట్‌ను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
'శివా రెడ్డి పల్లె' అనే మరో ట్విటర్ యూజర్ ఇటీవల జరిగిన సంఘటనను ముస్లిం డెలివరీ ఏజెంట్ నుండి డెలివరీ తీసుకోవడానికి కస్టమర్ నిరాకరించిన సంఘటనను మరొకదానికి లింక్ చేశారు.
పోస్ట్‌ను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
పలువురు ట్విట్టర్ యూజర్లు ఇందులో మతపరమైన కోణం ఉందని చెబుతూ ట్వీట్లు చేశారు.
పోస్ట్‌ను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ బృందం గచ్చిబౌలి పోలీసులను సంప్రదించింది. శివ, అమీర్‌ల మధ్య వాగ్వాదం డెలివరీ ఆలస్యంగా ఇస్తుండడం వలన జరిగింది కానీ.. మతం లేదా కులం ఆధారంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించింది కాదని ధృవీకరించారు.
డెలివరీ ఆలస్యం కావడంతో అమీర్‌కు చాలాసార్లు ఫోన్ చేశాడు. "కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది" అని గచ్చిబౌలి SHO తెలిపారు.
డెలివరీ ఏజెంట్ ఫ్లాట్‌కి వచ్చే వరకు వేచి ఉండేలా చూడమని శివను కోరాడు. "శివ వేచి ఉండమని అమీర్‌ను కోరాడు. ఇది వారి మధ్య విభేదాలకు దారితీసింది. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది. సెప్టెంబర్ 8న సాయంత్రం 6 గంటలకు డెలివరీ వ్యక్తి శివపై కత్తితో దాడి చేశాడు" అని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివ చెంప, గడ్డం, ఛాతీపై గాయాలయ్యాయి. డెలివరీ వ్యక్తి సంఘటన స్థలం నుండి పారిపోయాడు. అతని కుడి చేతికి గాయమైంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి, ఆపై నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సెప్టెంబర్ 15న మృతి చెందాడు. నిందితుడు పరారీలో ఉన్నాడని, వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో, "డెలివరీ బాయ్ అడ్రస్ కు సరిగా చేరుకోలేకపోయాడు. డెలివరీని దాదాపు రెండు గంటలు ఆలస్యం చేసాడు. అయితే, స్వీట్లు ఆర్డర్ చేసిన సాయి శ్రీ కాల్స్ చేస్తూ ఫోన్‌లో అతనితో వాదించడం ప్రారంభించాడు. ఎట్టకేలకు డెలివరీ బాయ్ లొకేషన్ దగ్గరకు వచ్చాడు, శివ ప్రసాద్ డెలివరీ బాయ్‌తో వాగ్వాదానికి దిగాడు, అతను డైనింగ్ టేబుల్ నుండి కూరగాయల కత్తిని పట్టుకుని శివ ప్రసాద్‌పై దాడి చేశాడు, అతని చెంప, గడ్డం మరియు ఛాతీపై గాయాలయ్యాయి." అని ఉంది.
ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని స్పష్టమవుతోంది. డెలివరీ ఆలస్యం కావడంతో గొడవ జరిగింది.
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.