2000 రూపాయల నోట్ల కట్టలను పెద్దగా పేర్చగా.. వాటి పక్కనే పోలీసు అధికారులు కూర్చుని ఉన్నారు. ఈ డబ్బంతా పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ నేతకు చెందిన ఇంట్లో దొరికిందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
"Education institutions, Hospitals, Universities are not being founded for what all the money of the country is going to BJP leaders and their friends' pockets. Huge money has been recovered from the house of a BJP leader in Bengal (sic)," అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
https://twitter.com/BEENA451971/status/1382839124382535682
విద్యాసంస్థలు. ఆసుపత్రులు, యూనివర్సిటీలను బీజేపీ నేతలు స్థాపించలేదని.. ప్రజల డబ్బు మొత్తం బీజేపీ నేతలు, వారి స్నేహితుల జోబుల్లోకే వెళ్తోందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. తాజాగా బెంగాల్ లో బీజేపీ నేత ఇంట్లో ఇంత డబ్బు దొరికిందని చెప్పుకొచ్చారు.
నిజనిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోకు.. బెంగాల్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని న్యూస్ మీటర్ తెలుసుకుంది. 2019 సంవత్సరం నవంబర్ లో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో పోలీసులకు దొరికిన దొంగనోట్ల రాకెట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ముంబై మిర్రర్, తెలంగాణ టుడే లాంటి మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
రిపోర్టుల ప్రకారం 2000 రూపాయల ఫేక్ నోట్లకు చెందిన 350 నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లు అచ్చం ఒరిజినల్ 2000 రూపాయల లాగే ఉంటాయి. కమీషనర్ ఆఫ్ పోలీసు తస్ఫీర్ ఇక్బాల్ ఈ ఘటనపై మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి టౌన్ లో ఈ ఫేక్ నోట్ల రాకెట్ ను పట్టుకున్నామని తెలిపారు.
నిందితులు ఫేక్ నోట్స్ ను ఎక్స్ ఛేంజ్ చేస్తూ ఉంటారని.. కట్టలో పైన ఒరిజినల్ నోటు పెడతారని కింద మొత్తం 'చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఉన్న నోట్లను ఉంచారని ఆయన తెలిపారు. ఇలా మోసాలకు పాల్పడుతూ ఉండేవారని.. పోలీసులు స్వాధీనం చేసుకున్న నోట్ల విలువ 7కోట్ల రూపాయలు అని తెలిపారు.
ANI న్యూస్ ఏజెన్సీ కూడా ఈ ఘటనపై ట్వీట్ చేసింది. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నదే.. ఇందులో కూడా ఉండడాన్ని గమనించవచ్చు.
కాబట్టి బెంగాల్ లో బీజేపీ నేత ఇంట్లో నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.