నిజమెంత: జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఎన్.డి.ఏ. కూటమిని వీడారా?
ప్రస్తుతం జేడీయూ, టీడీపీ సహాయంతో భారతీయ జనతా పార్టీ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Jun 2024 9:45 AM ISTనిజమెంత: జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఎన్.డి.ఏ. కూటమిని వీడారా?
ప్రస్తుతం జేడీయూ, టీడీపీ సహాయంతో భారతీయ జనతా పార్టీ కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది. జేడీయూ, టీడీపీ మద్దతు ఉపసంహరించుకుంటే మాత్రం ఎన్.డి.ఏ. ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. 2024లో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్.. ఎన్.డి.ఏ. కు మద్దతును ఉపసంహరించుకున్నారంటూ వదంతులు వైరల్ అవుతూ ఉన్నాయి.
జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడంపై న్యూస్ 24 యాంకర్ మనక్ గుప్తా రిపోర్టింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. పార్టీ సీనియర్ నాయకుల సమ్మతితో నితీష్ కుమార్ NDA నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారని మీడియా కథనం ఉంది.
ధృవీకరించబడిన X హ్యాండిల్ “నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకున్నారా?” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేస్తున్నారు. నితీష్ కుమార్ తిరిగి ఇండియా కూటమి లోకి వచ్చారని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని వీడియోలోని టెక్స్ట్ లో ఉంది.
నిజ నిర్ధారణ:
ఈ వీడియో 2022 నాటిది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామం కాకపోవడంతో ఈ వాదన తప్పుదోవ పట్టించేదిగా ఉందని NewsMeter గుర్తించింది.
మేము ట్వీట్ కింద 'ధృవ్ రాఠీ సెటైర్' అనే ఖాతా పేరును గమనించాము. ఈ వీడియో మొదట పేరడీ ఖాతా ద్వారా భాగస్వామ్యం చేశారని, దీనిని నిజమేనని పరిగణించి అనేక ఇతర X ఖాతాలు షేర్ చేశాయని ఇది సూచించింది.
మేము YouTubeలో నిర్దిష్ట కీవర్డ్ సెర్చ్ కూడా నిర్వహించాము. ఆగస్ట్ 9, 2022న న్యూస్ 24 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసిన మనక్ గుప్తాకు సంబంధించిన రాష్ట్ర కీ బాత్ 50 నిమిషాల వీడియోను మేము కనుగొన్నాము. వీడియో శీర్షిక 'నితీష్ కుమార్ ఎందుకు BJPని విడిచిపెట్టారు ?' అని ఉంది.
బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారని, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్‌తో మళ్లీ ప్రమాణం చేస్తారని చెప్పడం వీడియోలో వినవచ్చు. గుప్తా మాట్లాడిన తర్వాత, వీడియో 1:14 నిమిషాల టైమ్‌స్టాంప్‌లో కుమార్ తన పార్టీ నాయకుల ఆమోదంతో NDA నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన మీడియా బైట్‌ను చూపుతుంది.
ఆగస్ట్ 9, 2022న ఆజ్ తక్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రచురించిన నితీష్ కుమార్ ప్రకటనను మేము కనుగొన్నాము.
2022లో ఎన్‌డీఏ నుంచి వైదొలగడం ద్వారా నితీష్ కుమార్ ఒక కీలకమైన అడుగు వేశారు. ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతను లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (RJD), కాంగ్రెస్.. పార్టీలను కలిగి ఉన్న మహాగత్బంధన్ కూటమిలో చేరాడు. నితీష్ కుమార్ ఇండియా బ్లాక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల మొదటి సమావేశానికి ఆతిథ్యం కూడా ఇచ్చారు.
అయితే, ఆ తర్వాత మళ్లీ నితీష్ కుమార్ మూడ్ మారిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, నితీష్ కుమార్ NDAలోకి తిరిగి వచ్చారు, భారతీయ జనతా పార్టీ (BJP)తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమిలో JD(U), BJP చెరో 12 సీట్లు గెలుచుకోగా, ఇతర భాగస్వాములైన లోక్ జనశక్తి పార్టీ (LJP) (రామ్ విలాస్) 5 సీట్లు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) (HAMS) 1 సీటు గెలుచుకున్నాయి.
కాబట్టి, నితీష్ కుమార్ NDA నుండి వైదొలిగిన వీడియో, న్యూస్ 24 ఈ విషయాన్ని నివేదించడం 2022 నాటిదని మేము నిర్ధారించాము. ప్రస్తుతం, నితీష్ కుమార్ NDAలో ఉన్నారు.
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.నిజమెంత: జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఎన్.డి.ఏ. కూటమిని వీడారా?