ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో "40 students hospitalised after vaccination in Knp" అనే హెడ్ లైన్ ఉంది. 40 మంది విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆసుపత్రి పాలయ్యారన్నది ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లో ఉన్న సారాంశం.
భారత్ లో జనవరి 16 నుండి కరోనా వ్యాక్సిన్ పంపకాలు మొదలైన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం హెల్త్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ను ఇస్తూ ఉన్నారు. ఈ పేపర్ క్లిప్పింగ్ ను పోస్టు చేసిన నెటిజన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇలా జరిగింది అంటూ పోస్టు పెట్టారు. కాన్పూర్ లో ఇలా జరిగింది అన్నది పోస్టు సారాంశం.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ పేపర్ క్లిప్పింగ్ ను చూడగా ఈ పోస్టుకు.. ప్రస్తుతం జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. ఈ వార్త 2018లో వచ్చింది.
ఈ ఫోటోలో ఉన్న హెడ్ లైన్ ను గూగుల్ లో సెర్చ్ చేయగా.. హిందుస్థాన్ టైమ్స్ 2018 నవంబర్ లో కథనాన్ని ప్రచురించినట్లుగా pressreader.com వెబ్సైట్ లో ఉంది. అప్పటికి కరోనా మహమ్మారి రాలేదు. అలాగే కోవిద్-19 వ్యాక్సిన్ కు ఈ పేపర్ కటింగ్ కు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది.
"More than 40 children from three schools in Kanpur developed rashes, fever, headache and abdominal pain after they were administered measles, rubella vaccine on Thursday as part of a state wide vaccination programme." అంటూ అందులో కథనాలు వచ్చాయి. కాన్పూర్ లో ఆ రాష్ట్ర ప్రభుత్వం 'తట్టు' కు సంబంధించిన వ్యాక్సినేషన్ ను నిర్వహించగా.. 40 మందికి పైగా పిల్లల్లో దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, కడుపులో నొప్పి వంటి వాటితో బాధపడ్డారు. తట్టు, రూబెల్లా వ్యాక్సిన్ ను పిల్లలకు ఇచ్చారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ పోస్టులు ఫేక్ అని.. ప్రస్తుతం జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కు ఈ పేపర్ క్లిప్పింగ్ కు ఎటువంటి సంబంధం లేదు. ఈ పేపర్ క్లిప్పింగ్ 2018 సంవత్సరం లోనిది.