వ్యక్తిగత కారణాల వల్ల భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగాడు. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కోహ్లీ రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమవ్వడానికి అతని తల్లి అనారోగ్యానికి గురవ్వడమే కారణమని ఆరోపించారు. “అప్‌డేట్: విరాట్ తల్లి కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని విన్నాను, ఇది నిజం అయితే అతని తల్లి కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నాం. కోహ్లికి నిజంగా కష్టకాలం. ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని ఆశిస్తున్నాను.” అని క్రికెట్ జర్నలిస్ట్ ఓ పోస్టు పెట్టారు.
పలువురు ఎక్స్, Facebook వినియోగదారులు కూడా అదే వాదనతో పోస్టులు పెట్టారు. ఆ పోస్ట్‌లలో కోహ్లి తన తల్లితో ఉన్న ఫోటో కూడా ఉంది.
నిజ నిర్ధారణ :
కోహ్లి తల్లి అనారోగ్యంతో ఉందన్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము సంబంధిత కీవర్డ్ శోధనను నిర్వహించాము. టైమ్స్ ఆఫ్ ఇండియా జనవరి 31 నుండి ఒక నివేదికను చూశాము. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ సోదరుడు వికాష్ కోహ్లీ తమ తల్లి సరోజ్ కోహ్లీ ఆరోగ్యంపై ఇంటర్నెట్‌లో వ్యాపిస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఆమె 'ఫిట్ అండ్ ఫైన్' అని పేర్కొన్నారు.
విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ ఈ వదంతులను కొట్టిపారేశారు. వికాస్ తమ తల్లి గురించి వస్తున్న పుకార్లపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “అందరికీ హలో, మా అమ్మ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ వ్యాపిస్తున్నట్లు నేను గమనించాను, మా అమ్మ ఖచ్చితంగా ఫిట్ గానూ.. బాగానే ఉన్నారు. సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ, మీడియాను కూడా అభ్యర్థిస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, ”అని వికాస్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్టు పెట్టారు.
కాబట్టి, కోహ్లి తల్లి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam