క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని అరెస్ట్ చేశారంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“Breaking news: MS Dhoni has been arrested from Chepauk Stadium last night in fixing, and Amrapali Scam.” అంటూ ట్వీట్ ను వైరల్ చేస్తూ ఉన్నారు. 'బ్రేకింగ్ న్యూస్: ఫిక్సింగ్, ఆమ్రపాలి స్కామ్‌లో ఎంఎస్ ధోనిని నిన్న రాత్రి చెపాక్ స్టేడియంలో అరెస్టు చేశారు' అని అందులో ఉంది.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం ఈ వాదనలో ఎటువంటి నిజం లేదని గుర్తించింది.
సంబంధిత కీ వర్డ్స్ తో సెర్చ్ చేయడం ద్వారా మేము మా పరిశోధనను ప్రారంభించాము. అయితే MS ధోనిని చెపాక్ స్టేడియంలో అరెస్టు చేయడం గురించి విశ్వసనీయమైన మీడియా నివేదికను కనుగొనలేకపోయాము.
మేము దీన్ని మొదట పోస్ట్ చేసిన @Naeem ట్విట్టర్ హ్యాండిల్‌ను కూడా స్కాన్ చేసాము. ఇది క్రికెట్ అభిమానులకు పేరడీ ఖాతా అని కనుగొన్నాము. ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టంగా తెలుస్తోంది.
అమర్‌పాలి స్కామ్‌తో ఎంఎస్ ధోనీకి ఏమి సంబంధం?
ఇండియా టుడేలో 2019 నివేదిక ప్రకారం, ఆమ్రపాలి గ్రూప్ పదివేల మంది గృహ కొనుగోలుదారులు చెల్లించిన డబ్బును స్వాహా చేయడం ద్వారా మోసానికి పాల్పడిందని.. హౌసింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
సుప్రీంకోర్టులో సమర్పించిన ఆడిట్ నివేదిక ప్రకారం, రితి స్పోర్ట్స్ ద్వారా ఎంఎస్ ధోని ఆమ్రపాలి వివాదంలో చిక్కుకున్నాడు. 2009 నుంచి 2015 మధ్య కాలంలో ఆమ్రపాలి గ్రూప్ రితి స్పోర్ట్స్‌కు మొత్తం రూ.42.22 కోట్లు చెల్లించిందని ఆడిట్ నివేదిక పేర్కొంది. ఈ మొత్తంలో రూ.6.52 కోట్లు ఆమ్రపాలి సఫైర్ డెవలపర్స్ చెల్లించింది.
ధోనిని అరెస్టు చేయలేదని స్పష్టమవుతోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Sunanda Naik