ఎన్టీటీవీకి ఇటీవలే రాజీనామా చేశారు సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్. ఎన్డీటీవీ ఛానెల్ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ దాని మాతృ సంస్థ అయిన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్లుగా రాజీనామా చేసిన తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ ఎన్డీటీవీ నుంచి వైదొలిగారు. NDTV గ్రూప్ ప్రెసిడెంట్ సుపర్ణ సింగ్, తన సహోద్యోగులకు పంపిన ఒక ఈ మెయిల్‌లో, రవీష్ NDTVకి రాజీనామా చేసారు.
అదానీ టేకోవర్ చేయడంతో, సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ న్యూస్ ఛానెల్‌కు రాజీనామా చేసిన తరువాత, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను రవీష్ కుమార్‌ను భర్తీ చేస్తానని, ఎన్‌డిటివిలో ఒక షోను హోస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
వైరల్ క్లిప్ NDTV రిపోర్ట్ నుండి క్లిప్ లాగా కనిపిస్తోంది. దీనిపై ట్విట్టర్‌లో పోస్టులు పలువురు చేశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం వైరల్ క్లిప్ కీఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. వైరల్ వీడియో 2018లో ఇండియా టుడే అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిందని కనుగొన్నాము. అందులో వివరణలో భాగంగా "'BJP spokesperson, Sambit Patra takes the anchor seat of the 'To The Point' show on India Today to discuss whether the united opposition is a real challenge to Modi." అని ఉంది.
సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ 2018లో ఈ వీడియోను ట్వీట్ చేసి ఇలా రాశారు. "Stellar show by @sambitswaraj as an @IndiaToday guest anchor; super send up/parody of prime time news debate." దీన్ని బట్టి అప్పట్లో ఆయన గెస్ట్ యాంకరింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ క్లిప్ ఇటీవలిది కాదని, ఎన్‌డిటివికి రవీష్ కుమార్ రాజీనామాతో సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది 2018 నాటి పాత వీడియో, సంబిత్ పాత్ర ఇండియా టుడేలో ఒక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.