రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పోలి ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన ఫొటో వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని బార్కాస్‌లో రష్యా అధ్యక్షుడు కూర్చున్నట్లుగా ఫోటో ఉందని ప్రచారం జరుగుతోంది.
ఫోటోలో ఉన్న వ్యక్తి లుంగీ, గులాబీ రంగు చొక్కా ధరించి ఉన్నారు. ఓ వీధిలో మూసి ఉన్న షట్టర్ పక్కన కూర్చున్నాడు.
న్యూస్‌మీటర్ కు వాట్సాప్‌లో “అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్‌లోని బార్కాస్‌లో కనిపించారు” అనే శీర్షికతో ఫోటోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న ఫోటోను డిజిటల్ గా ఎడిట్ చేశారని న్యూస్ మీటర్ బృందం గుర్తించింది.
ఫోటో డిజిటల్‌గా మార్చినట్లు న్యూస్‌మీటర్ కనుగొంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడంలో, మేము డ్రీమ్స్ టైమ్ వెబ్‌సైట్‌లో అసలు ఫోటోను కనుగొన్నాము. అసలు ఫోటో మీసాలు ఉన్న వేరే వ్యక్తిని చూపిస్తుంది.
ఒరిజినల్ చిత్రం 12 జనవరి 2015 నాటిది. "మీసాలతో ఉన్న భారతీయ వ్యక్తి గోధుమ రంగులో ఉన్న లుంగీ, పింక్ షర్ట్‌లో వీధిలో మూసి ఉన్న దుకాణం పక్కన కూర్చున్నాడు" అని పేరు పెట్టారు.
మేము 1 సెప్టెంబర్ 2015న ప్రచురించబడిన ఇమేజ్ స్టాక్ వెబ్‌సైట్ iStockలో అసలు ఫోటోను కూడా కనుగొన్నాము. ఈ ఫోటోలో మీసాలు ఉన్న వేరొక వ్యక్తి ఉన్నట్లు చూపిస్తుంది.
అసలు, మార్ఫ్ చేసిన ఫోటోల మధ్య రెండు తేడాలు, రెండు సారూప్యతలను మేము గమనించాము.
· అసలు ఫోటో మీసాలతో వేరే వ్యక్తిని చూపిస్తుంది.
· ఒరిజినల్ ఫోటో కూడా అదే లుంగీ, గులాబీ రంగు చొక్కా ధరించి, మార్ఫింగ్ చేసిన ఫోటోలో చూసినట్లుగా, మురికి వీధిలో మూసి ఉన్న షట్టర్ పక్కన కూర్చున్నట్లు చూపిస్తుంది.
అసలు, మార్ఫింగ్ చేసిన ఫోటోల మధ్య పోలిక ఇక్కడ ఉంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పోలిన వ్యక్తి వైరల్ ఫోటో డిజిటల్‌గా ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హైదరాబాద్‌లోని బార్కాస్‌లో కూర్చున్నట్లు చూపుతున్నారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.