కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల మేర 'భారత్ జోడో యాత్ర' చేపట్టింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది.
పాదయాత్రను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ల్యాప్‌టాప్‌లో రాహుల్ గాంధీ యాత్రను చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
'భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ నిశితంగా గమనిస్తున్నారు' అని ఓ యూజర్ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా యూజర్లు ఇలాంటి దావాలతో చిత్రాన్ని క్లెయిమ్ చేసారు. (పోస్ట్‌లను ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి).
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం ఫోటో వెనుక ఉన్న నిజాన్ని కనుగొనడానికి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. అనేక మీడియా సంస్థలు డిసెంబర్ 2020లో ప్రచురించబడిన తమ కథనాలలో ఈ ఫోటోను ఉపయోగించినట్లు గుర్తించాము. అసలు చిత్రంలో, మంత్రి ల్యాప్‌టాప్‌లో వర్చువల్ మీటింగ్ కు హాజరవుతున్నట్లు చూడవచ్చు.
స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో "#పాండమిక్ మార్నింగ్స్" అనే క్యాప్షన్‌తో ఫోటోను పోస్ట్ చేశారు.
మరింత స్పష్టత కోసం, మేము అసలు ఫోటోకు చేసిన డిజిటల్ గా చేసిన మార్ఫింగ్ ను హైలైట్ చేసాము. అసలు ఫోటోలో రాహుల్ గాంధీ బొమ్మ లేదు, టేబుల్ మీద ఉన్న గ్లాస్ నిండా నీళ్లలా ఉన్నాయి. మార్చబడిన ఫోటోలో, ఆల్కహాల్ లాగా కనిపించేలా ద్రవంగా రంగు మార్చబడింది.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేసిందని స్పష్టంగా తెలుస్తోంది.