కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి చెందిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఫోటో అని చెబుతున్నారు. ఆ ఫోటోలో రాహుల్ గాంధీ జుట్టు గజిబిజిగా.. గుబురు గడ్డం ఉన్నట్లు చూపిస్తుంది.
జర్నలిస్ట్ సూరజిత్ దాస్‌గుప్తా ఫోటోను పంచుకున్నారు. రాహుల్ గాంధీ యూత్ ఐకాన్‌గా విఫలమయ్యారని.. ఇప్పుడు ఆయన్ను వృద్ధుడిగా చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ దాస్‌గుప్తా "వారు అతనిని యూత్ ఐకాన్‌గా చూపించడానికి ప్రయత్నించారు. అది పని చేయలేదు." అని చెప్పుకొచ్చారు.
They tried to sell him as a youth icon. Didn't work. They tried to sell his pet, Pidi, to project a soft side. लोगों ने पिद्दी का शोरबा बना दिया। They tried rain. Got washed away. They are now trying old age. No 'Marx' for guessing this will fail too. అంటూ సూరజిత్ దాస్‌గుప్తా ఫోటోను షేర్ చేశారు.
పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అనేక ఇతర వినియోగదారులు విభిన్న సందర్భాలతో చిత్రాన్ని పంచుకున్నారు. (పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.)
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో ఫోటో కోసం వెతికినా వైరల్ ఫోటో కనుగొనబడలేదు. సెప్టెంబరు 7న భారత్ జోడో యాత్ర ప్రారంభమైనప్పటి నుండి రాహుల్ గాంధీకి సంబంధించిన చాలా చిత్రాలను గమనించాము. రాహుల్ ఫోటోలు లేదా వీడియోలు ఏవీ వైరల్ ఫోటోలో చూసినట్లుగా అతని గడ్డం, జుట్టు పెరిగినట్లు చూపించలేదు.
వైరల్ ఫోటో మూలాన్ని కనుగొనడానికి, మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. అక్టోబర్ 19న ప్రచురించిన డెక్కన్ హెరాల్డ్ కథనంలో ఉపయోగించిన అదే ఫోటోను కనుగొన్నాము. ఈ ఫోటోలో, బ్యాక్‌గ్రౌండ్, అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఒకేలా ఉన్నారు కానీ.. రాహుల్ గాంధీ జుట్టు మరియు గడ్డం వైరల్ ఫోటోలో చూసినంత గజిబిజిగా లేదా పెరిగినట్లు లేవు.
డెక్కన్ హెరాల్డ్ ఈ ఫోటోను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ)కి క్రెడిట్స్ ఇచ్చింది. మేము PTI ఆర్కైవ్‌లో ఫోటోను కనుగొన్నాము, కానీ వైరల్ ఫోటోలో కనిపించే విధంగా కనిపించలేదు. PTI ప్రకారం, ఈ ఫోటో అక్టోబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో భారత్ జోడో యాత్రలో తీయబడింది.
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, newKerala.com ద్వారా పోస్టు చేసిన అదే ఫోటోను మేము కనుగొన్నాము, కానీ వాటిలో ఏదీ రాహుల్ గాంధీని గజిబిజిగా ఉన్న జుట్టు, గడ్డంతో చూపలేదు.
వైరల్‌గా మారిన ఫొటో మార్ఫింగ్ అని తేలింది. అందువల్ల, ఈ పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి.