వినాయకచవితిని దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షల మధ్య నిర్వహించారు. ఇక పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో తమ అభిమానులకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కు భారత్ లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏబీడీ కూడా భారత్ మీద అంతే గొప్పగా అభిమానాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల ఏబీడీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. అందులో ఏబీ డివిలియర్స్ వినాయకుడి విగ్రహాన్ని పట్టుకొని ఉండడం గమనించవచ్చు.
గణేష్ చతుర్థి వేడుకల మధ్య, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ గణపతి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో '#హ్యాపీగణేష్ చతుర్థి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతుంది. క్రికెటర్ యొక్క ఫ్యాన్ పేజీలు కూడా చిత్రాన్ని షేర్ చేశాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేయబడినది.
న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఒరిజినల్ ఇమేజ్ ను కనుక్కోవడం జరిగింది. 3 జూన్ 2017 తేదీన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చేసిన ట్వీట్ లో డివిలియర్స్ ఫోటో కనుగొనబడింది. అసలు చిత్రంలో డివిలియర్స్ ట్రోఫీని పట్టుకున్నాడు.. వినాయకుడి విగ్రహం కాదు.
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో క్రికెటర్ శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. 2 జూన్ 2017 నాటి నివేదికలో icc-crick.com వెబ్‌సైట్ అదే ఫోటోను కలిగి ఉంది. అదే చిత్రాన్ని ఎక్స్‌ప్రెస్ మరియు స్పోర్ట్స్ లిబ్రో కూడా పోస్టు చేశాయి.
కాబట్టి ఏబీడీ చేతిలో ఉన్న ట్రోఫీని మార్ఫింగ్ చేసి.. వినాయకుడి ఫోటోను ఉంచారు. అలా సోషల్ మీడియాలో షేర్లు చేస్తూ వచ్చారు.