రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు క్వీన్ ఎలిజబెత్ II ఒకే ఫోటోలో ఉన్నట్లుగా పోస్టులను వైరల్ చేస్తూ వస్తున్నారు. భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ సభ్యులు రాణికి సెల్యూట్ చేస్తున్నారనే వాదనతో కూడిన చిత్రం వైరల్ అవుతోంది.
వైరల్ ఇమేజ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు తమ శాఖ కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో యూనిఫామ్ ధరించగా.. రాణి వారి ముందు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. "బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా దేశమంతా పోరాడుతున్నప్పుడు ఇంగ్లాండ్ రాణికి వందనం చేయడంలో బిజీగా ఉన్నారు కొద్దిమంది దేశద్రోహులు. వారి వారసులు ఇప్పుడు తమను తాము దేశభక్తులుగా పిలుస్తున్నారు." అంటూ ఫోటోను పోస్టు చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుసుకుంది న్యూస్ మీటర్.
న్యూస్‌మీటర్ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ఆర్.ఎస్.ఎస్. ఫోటోను నాగపూర్ టుడే 14 ఆగస్టు 2013 న మరియు డెక్కన్ క్రానికల్ 22 జనవరి 2015 న రిప్రజెంటేషన్ ఇమేజ్‌గా ఉపయోగించారు.
మరొక రివర్స్ ఇమేజ్ సెర్చ్ 2018 లో టైమ్స్ మరియు గెట్టి ఇమేజెస్ ద్వారా ఒక నివేదికలో బ్రిటీష్ రాణి ఫోటోలను కనుక్కున్నాం. చిత్రం 2 ఫిబ్రవరి 1956 న నైజీరియాలో తీయబడింది. దీని పేరు, "క్వీన్ ఎలిజబెత్ II, 2 ఫిబ్రవరి 1956, కామన్వెల్త్ పర్యటనలో నైజీరియాలోని కడునా విమానాశ్రయంలో.. కొత్తగా పేరు మార్చుకున్న క్వీన్స్ ఓన్ నైజీరియా రెజిమెంట్, రాయల్ వెస్ట్ ఆఫ్రికన్ ఫ్రాంటియర్ ఫోర్స్ లను చూస్తోంది." అని తెలిపింది. ఒకప్పటి ఫోటోలను తీసి బ్యాక్ అండ్ వైట్ లో పెట్టి మార్ఫింగ్ చేశారు. వైరల్ ఫోటోలకు సంబంధించిన తేడాలను ఇక్కడ చూడొచ్చు.
అసలు చిత్రాలు మరియు వైరల్ ఇమేజ్‌ని పక్కపక్కన ఉంచి పోలికను చూడొచ్చు. వైరల్ ఇమేజ్ మార్ఫింగ్ చేయబడిందని స్పష్టంగా చూపిస్తుంది.
కాబట్టి వైరల్ ఫోటోలు మార్ఫింగ్ చేయబడినవి..!