డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని వేలాడదీసిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారతదేశానికి గౌరవంగా పుతిన్ తన కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రదర్శించారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఈ చిత్రాన్ని పంచుకుంటున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని న్యూస్‌మీటర్ కనుగొంది. ఒరిజినల్ ఫోటోలో పుతిన్ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని చూపలేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫోటో స్టాక్ వెబ్‌సైట్ అలమీలో అసలు చిత్రాన్ని కనుగొన్నాము. అసలు చిత్రం రష్యన్ ఫెడరేషన్ జాతీయ చిహ్నాన్ని చూపుతుంది. అక్కడ డాక్టర్ అంబేద్కర్ చిత్రం కనిపించలేదు.
చిత్రం 15 ఫిబ్రవరి 2017న ప్రచురించారు. రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్థిక సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారని చెబుతున్నారు. (“Russian President Vladimir Putin holding a conference on economic issues in the Kremlin From left to right Sergei Ignatyev.”)
ఒరిజినల్ ఫోటో.. మార్ఫింగ్ చేసిన ఫోటో మధ్య ఉన్న తేడాను మీరు గమనించవచ్చు.
పుతిన్ అధికారిక సైట్‌లో కూడా సారూప్య చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. "వ్లాదిమిర్ పుతిన్ భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు" అనే శీర్షికతో కథనం ఉంది. ఈ చిత్రంలో కూడా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని చూపలేదు.
అందువల్ల, పుతిన్ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచారంటున్న వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam