నేనేమీ అజ్ఞాతం లోకి పోలేదు.. అదంతా అబద్ధం: మోహన్ బాబు

మంచు మోహన్ బాబు తన అరెస్టు నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నారని మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి.

By Kalasani Durgapraveen  Published on  14 Dec 2024 7:45 AM GMT
నేనేమీ అజ్ఞాతం లోకి పోలేదు.. అదంతా అబద్ధం: మోహన్ బాబు

మంచు మోహన్ బాబు తన అరెస్టు నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నారని మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన గురించి తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని, నిజాలు తెలుసుకోవాలని మీడియాకు మోహన్ బాబు సూచించారు. మోహన్ బాబు కోసం గాలింపు చేపట్టడం లేదని పోలీసులు కూడా స్పష్టం చేశారు .

తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు అంటూ కోర్టు విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ వేశారు మోహన్ బాబు. నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను ప్రచురించాలని మీడియాను కోరుతున్నానంటూ మోహన్ బాబు ట్వీట్ వేశారు.


Next Story