కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భారత్ ను ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంది. ఎన్నో రాష్ట్రాల్లో కరోనా వలన చాలా మంది మరణిస్తూ వస్తున్నారు. శవాలకు దహన సంస్కారాలను నిర్వహించడానికి కూడా స్థలం లేదని చాలా మంది వాపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వచ్చాయి.
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఉన్న 'టిప్పు ఖాన్ బ్రిడ్జి' వద్ద సామూహిక దహన సంస్కారాలను నిర్వహించారంటూ ఓ వీడియో వాట్సాప్ లో వైరల్ అవుతూ ఉంది.
"Langar House mass cremation. Please stay safe. Situation out of control now," అంటూ అదే వీడియోను ఫేస్ బుక్ లో కూడా పోస్టు చేశారు. పరిస్థితి చేజారిపోతోందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
https://www.facebook.com/watch/?v=165234788818845
నిజ నిర్ధారణ:
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఉన్న 'టిప్పు ఖాన్ బ్రిడ్జి' వద్ద సామూహిక దహన సంస్కారాలను నిర్వహించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న వీడియోను నిశితంగా పరిశీలించగా అక్కడ ఉన్నది 'టిప్పు ఖాన్ బ్రిడ్జి' కాదని స్పష్టంగా తెలుస్తోంది. 'టిప్పు ఖాన్ బ్రిడ్జి' కి సంబంధించిన ఫోటోలు, పలువురు పోస్టు చేసిన వీడియోలు, గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించి చూడగా ఆ వీడియోలో ఉన్న బ్రిడ్జి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ వీడియోలో ఉన్న బ్రిడ్జికి 'టిప్పు ఖాన్ బ్రిడ్జి' కి సంబంధం లేదు.
ఈ కింది ఫోటోలలో మీరు తేడాలను గమనించవచ్చు.
'టిప్పు ఖాన్ బ్రిడ్జి' ఫోటోలను గమనించి.. చుట్టూ ఉన్న పరిసరాలను చూడగా మీకే ఓ క్లారిటీ వస్తుంది.
ఎన్నో సోషల్ మీడియా పేజీల్లో కూడా ఈ వీడియోను పోస్టు చేయడం గమనించవచ్చు.
#IndiaNeedsOxygen#WhoFailedIndia? #Movid21 Modi Virus Disease 21 #WeCantBreathe #IndiaCantBreathe #IndianLivesMatter #IndiaNeedsOxygen #IndiaNeedsVaccine అంటూ ఈ వీడియోను పోస్టు చేస్తూ వచ్చారు.
లంగర్ హౌస్ ఎస్.హెచ్.ఓ. కె.శ్రీనివాస్ ను ఈ విషయమై న్యూస్ మీటర్ సంప్రదించగా.. వైరల్ అవుతున్న వీడియోకు హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. వీడియోను నిశితంగా గమనిస్తే ఆడియోలో ఉన్నది స్థానిక యాస కానే కాదని అన్నారు. అలాగే లంగర్ హౌస్ ప్రాంతంలో వీడియోలో ఉన్నటువంటి ఫ్లై ఓవర్ లేదని అన్నారు. పివిఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే లంగర్ హౌస్ నుండి వెళ్లినప్పటికీ ఎక్కడ కూడా ఫ్లై ఓవర్ మీద ఫుట్ పాత్ లేదని తేల్చి చెప్పారు. ఆ వీడియోలో ఫుట్ పాత్ ఉండడాన్ని గమనించవచ్చని ఆయన తెలిపారు.
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఉన్న 'టిప్పు ఖాన్ బ్రిడ్జి' వద్ద సామూహిక దహన సంస్కారాలను నిర్వహించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.