ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని భార్య ఆంటోనెలా రోకుజో ఇరాక్‌లోని పవిత్ర నగరమైన కర్బాలాను సందర్శించినట్లు చూపుతున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. విజువల్స్ కర్బలాలోని అల్-అబ్బాస్ మందిరాన్ని పోలి ఉండే స్మారక చిహ్నం దగ్గర ఈ జంట కనిపించింది. సెలవుల్లో భాగంగా వీరు అక్కడికి వచ్చారని చెబుతున్నారు.
“@leomessi and @antonelagallery in the holy city of Karbala, sharing a moment of respect and cultural connection. #Karbala #Iraq #Messi #Respect #Culture.” అంటూ పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదని కనుగొంది. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి చిత్రాలు రూపొందించారు.
మేము మెస్సీ కర్బాలా పర్యటనకు సంబంధించిన విశ్వసనీయ వార్తల కోసం శోధించాము, కానీ ఏదీ కనుగొనలేకపోయాం.
నిశితంగా పరిశీలిస్తే విజువల్స్‌లో ‘GROK’ అని రాసి ఉన్న వాటర్‌మార్క్ ఉంది.
Grok ఇమేజ్ జెనరేటర్ ద్వారా కొత్త కొత్త ఫోటోలను ఏఐ ద్వారా సృష్టించవచ్చు. టెక్స్ట్ ఇన్‌పుట్‌ల నుండి ఈ AI టూల్ ద్వారా కంటెంట్ ను సృష్టించవచ్చు. ఇది ప్రత్యేకంగా ఇలాంటి క్రియేటివిటీ కోసం నిర్మించినట్లు అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. ఇది విజువల్స్ ఫోటోగ్రాఫ్స్ కాదని, డిజిటల్ సృష్టి అని మేము తెలుసుకున్నాం.
సైట్ ఇంజిన్, హైవ్ మోడరేషన్ వంటి AI-డిటెక్షన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మరింత పరిశోధన చేయగా.. ఈ చిత్రాలు AI ద్వారా సృష్టించినట్లు కనుగొన్నాం.
ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఈ వైరల్ ఫోటోలు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ అని గుర్తించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చిత్రాలను సృష్టించినట్లు నిర్ధారించాము. ఈ చిత్రాలు వరుసగా 99 శాతం, 99.8 శాతం AI ద్వారా సృష్టించినవేనని గుర్తించాం.
అందువల్ల, లియోనెల్ మెస్సీ, ఆంటోనెలా రోకుజో కర్బాలాను సందర్శించారనే వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న చిత్రాలు AI ద్వారా రూపొందించినవి.
Credits : Sibahathulla Sakib