సినీ నటుడు అల్లు గత రాత్రే విడుదల అవుతారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. అల్లు అర్జున్ జైలులో రాత్రంతా ఉండడంపై ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి స్పందించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీలను జైలు అధికారులకు ముందే అందజేశామని.. కానీ ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళతామని, మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుండి విడుదలయ్యాడు. విడుదల ప్రక్రియ ఆలస్యం అవ్వడంతో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే గడపాల్సి వచ్చింది. అల్లు అర్జున్ ను విడుదల చేయడానికి, ఆయన న్యాయ బృందం జైలు అధికారులకు 50 వేల రూపాయల పూచీకత్తును సమర్పించింది. శుక్రవారం రాత్రి హైకోర్టు నుండి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందాయి. దీంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదల అయ్యారు.