'సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టకుండా ఆపేందుకు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కావాలనే విశ్రాంతి ఇస్తున్నారు' అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఒక X ప్రీమియం వినియోగదారుడు కూడా ఈ పోస్ట్ చేసారు, “ఈ రోజుల్లో కోహ్లీకి రెగ్యులర్‌గా విశ్రాంతి లభిస్తోంది, వారు సచిన్ రికార్డును అలాగే ఉంచాలని కోరుకుంటున్నారు.” అని గిల్ క్రిస్ట్ చెప్పినట్లు పోస్టులు వైరల్ చేస్తున్నారు.
చాలా మంది X , Facebook వినియోగదారులు అదే కోట్‌ను పోస్ట్ చేసారు. ఆడమ్ గిల్‌క్రిస్ట్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
అటువంటి ప్రకటన ఆడమ్ గిల్‌క్రిస్ట్, AB డివిలియర్స్ చేయలేదని NewsMeter కనుగొంది.
మేము Googleలో కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. కానీ ఆడమ్ గిల్‌క్రిస్ట్ లేదా AB డివిలియర్స్ అటువంటి ప్రకటన చేశారని నివేదించే విశ్వసనీయ మీడియా నివేదికను మేము చూడలేదు. ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో లెజెండ్స్.. అలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, మీడియా తప్పకుండా నివేదించేది.
విజ్డెన్ ద్వారా 'నెవర్ సేడ్ దిస్' అనే శీర్షికతో మేము ఒక నివేదికను చూశాము. ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరు మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు నకిలీదని తెలిపారు. తనకు ఆపాదించబడిన నకిలీ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నట్లుగా మీడియా కథనంలో ఉంది.
మరో వెబ్‌సైట్, సర్కిల్ ఆఫ్ క్రికెట్ లో కూడా విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్‌ల రికార్డుపై గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యలు చేశారనే వాదనను ఖండించారు.
గిల్‌క్రిస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ మాట తానెప్పుడూ చెప్పలేదని పోస్టు పెట్టాడు.
కాబట్టి, ఆడమ్ గిల్‌క్రిస్ట్, AB డివిలియర్స్ లు విరాట్ కోహ్లీకి బ్రేక్ ఇవ్వడంపై వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam