పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సందర్భంగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సైమన్ డౌల్ తనను పాకిస్తాన్‌లో వేధించారని అన్నట్లు పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, మీడియా సంస్థలు పేర్కొన్నాయి. బాబర్ అజామ్ ను విమర్శించిన తర్వాత ఈ వేధింపులు జరిగినట్లు సమాచారం.
రిపబ్లిక్, DNA, OpIndia వంటి మీడియా సంస్థలు డౌల్‌ను ఉటంకిస్తూ “పాకిస్థాన్‌లో జీవించడం అంటే జైల్లో జీవించడం లాంటిది.” అని అన్నారని తెలిపాయి.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని న్యూస్ మీటర్ బృందం గుర్తించింది.
ఏప్రిల్ 16న సైమన్ డౌల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదని చెప్పినట్లు న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము కీవర్డ్ శోధనను నిర్వహించాము. ఏప్రిల్ 13న ప్రచురించబడిన జియో న్యూస్ నివేదికను కనుగొన్నాము. డౌల్‌కు ఆపాదించబడిన అటువంటి ప్రకటన ఏదీ నివేదించడాన్ని ఆ సంస్థ ఖండించింది. డౌల్ అటువంటి ప్రకటన చేయలేదని కూడా పేర్కొంది.
పాకిస్థాన్ క్రికెట్ జర్నలిస్ట్ సాజ్ సాదిక్ ఏప్రిల్ 13న చేసిన ట్వీట్‌లో, తాను డౌల్‌తో మాట్లాడానని, "పాకిస్తాన్‌లో ఉండడాన్ని తాను ఇష్టపడ్డానని" చెప్పాడని అన్నారు. పాకిస్థాన్‌లో చాలా రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నారనే వాదనను కూడా ఆయన ఖండించారు.
“It is sad when so-called news channels publish false stories that are made up from fake social media accounts. Please note Absolutely None of this is true. I loved my time in Pakistan and also love my time in India. Stop the hatred and vitriol towards one another, please. And stop publishing this for your own agenda you sad people.” అంటూ సైమన్ డౌల్ పోస్టు పెట్టారు. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వచ్చిన తప్పుడు కథనాలను కొన్ని వార్తా ఛానళ్లుగా ప్రచురించడం బాధాకరమని అన్నారు. వీటిలో ఏదీ నిజం కాదని దయచేసి గమనించండి. నేను పాకిస్తాన్‌లో గడిపిన సమయాన్ని ఇష్టపడ్డాను. భారతదేశంలో కూడా నా సమయాన్ని ప్రేమిస్తున్నానని అన్నారు.
సైమన్ డౌల్ గురించి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam