కపిల్ దేవ్ ఉన్న ఫోటో.. దాని మీద హిందీలో కొన్ని వ్యాఖ్యలు ఉండగా అది సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. '#कपिलदेव का बड़ा बयान: अमित शाह के बेटे के दबाव में किसानों के खिलाफ ट्वीट कर रहे हैं भारतीय खिलाड़ी.' అని అందులో ఉంది.
"కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు: భారత క్రికెటర్లు రైతులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయడానికి ముఖ్య కారణం అమిత్ షా కుమారుడు జై షా ఒత్తిడి తీసుకుని వస్తూ ఉండడమే" అని అందులో ఉంది. అమిత్ షా కుమారుడు క్రికెటర్ల మీద ఒత్తిడి చేస్తూ ఉండడంతో ఇలా క్రికెటర్లు రైతులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారని అందులో ఉంది.
పలువురు ఈ పోస్టులను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్ టెక్స్ట్ తో కూడా ట్వీట్లు చేశారు.
Archive links: https://web.archive.org/save/https://twitter.com/mohammad_aquif/status/1358470146134736899
https://web.archive.org/save/https://www.facebook.com/aabid.shekh.140/posts/1376582119371143
నిజ నిర్ధారణ:
కపిల్ దేవ్ మీద వైరల్ అవుతున్న ఈ పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'. కపిల్ దేవ్ ఇలాంటి స్టేట్మెంట్ అసలు చేయలేదు.
'Kapil Dev on Farmers protest' అనే కీవర్డ్స్ ను ఉపయోగించి చూడగా.. కపిల్ దేవ్ చేసిన ఒక ట్వీట్ గురించి కథనాలు వచ్చాయి. ఫిబ్రవరి 4, 2021న కపిల్ దేవ్ రైతుల ఉద్యమంపై ట్వీట్ చేశారు. అందులో రైతులు, భారత ప్రభుత్వం మధ్య ఉన్న వివాదం వీలైనంత త్వరగా పరిష్కారమవ్వాలని కోరుతున్నానని అన్నారు. అలాగే ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత క్రికెట్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది.
https://www.indiatvnews.com/sports/cricket/let-the-experts-take-a-call-kapil-dev-on-farmers-protest-682759
https://zeenews.india.com/hindi/sports/cricket/kapil-dev-tweet-on-rihanna-and-farmers-protest-said-india-is-supreme/842133
ఇక ఆయన ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా.. రైతుల ఉద్యమం గురించి కపిల్ దేవ్ ఇతర ట్వీట్లు చేసినట్లుగా లేదు.
వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న ఫోటోను పలు మీడియా సంస్థలు గతంలో ఉపయోగించాయి.
https://www.dailypioneer.com/2020/sports/don-t-get-carried-away-with-pace-friendly-wickets-in-australia--kapil-dev-to-indian-bowlers.
html https://zeenews.india.com/cricket/kapil-dev-former-team-india-skipper-suffers-heart-attack-hospitalised-2319584.html
వైరల్ అవుతున్న ఫోటోను అక్టోబర్ 2019న తీశారు. కపిల్ దేవ్ బీసీసీఐ అడ్వైజరీ కమిటీ నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినప్పటిది.
https://www.india.com/sports/kapil-dev-tenders-resignation-from-three-member-cricket-advisory-committee-3791565/
అమిత్ షా కుమారుడు జై షా కారణంగా క్రికెటర్లు రైతులకు వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతున్నారంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.