నటి ఊర్మిళ అటు బాలీవుడ్ సినిమాలతో పాటూ.. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ సినిమాల ద్వారా ఊర్మిళ తెలుగులో బాగా పాపులర్ అయ్యారు.
ఊర్మిళ తన భర్త మోహసీన్ అఖ్తర్ తో కలిసి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మేనకోడలు ఊర్మిళా మటోండ్కర్ అంటూ పలువురు పోస్టులు చేశారు. ఆమె మీద బ్రాహ్మిణ్ అని కూడా రాశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న కథనాల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మే 25, 2016న The Indian Express ఓ కథనాన్ని ప్రచురించింది. ఊర్మిళ తన భర్త మోసీన్ అఖ్తర్ తో కలిసి రొమాంటిక్ డిన్నర్ డేట్ కు వెళ్ళింది అన్నది ఆ వార్తా కథనంలో ఉంది.
నటి ఊర్మిళ మార్చి 3 న అతి తక్కువ మంది సమక్షంలో కాశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త మోసీన్ అఖ్తర్ మీర్ ను వివాహం చేసుకున్నారు. ఊర్మిళ సన్నిహితుడు మరియు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా మాత్రమే బాలీవుడ్ నుండి వివాహానికి హాజరయ్యారు. మార్చి 06, 2016 న జాగ్రాన్ మీడియా సంస్థ నివేదిక ప్రకారం, మోసీన్ అఖ్తర్ బాలీవుడ్ చిత్రం 'లక్ బై ఛాన్స్' లో కనిపించారు. ఈ చిత్రంలో మోసీన్ అఖ్తర్ ఫర్హాన్ ప్రత్యర్థి మోడల్ పాత్రలో కనిపిస్తాడు. ఇది కాకుండా 'ఇట్స్ మ్యాన్స్ వరల్డ్' చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో కనిపించారు. సౌరభ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొహిసిన్ పురుష సెక్స్ వర్కర్ పాత్రలో కనిపించాడు.
ఆమె ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ కు మేనకోడలు అవుతుందా అని గూగుల్ లో కానీ, ఇతర చోట్ల కానీ వెతకగా అందులో ఎటువంటి నిజం లేదని తెలిసింది.
2016 నుండి ఇలాంటి తప్పుడు కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయి. పలు మీడియా సంస్థలు ఈ కథనాలు తప్పు అంటూ చెప్పుకొచ్చాయి.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. బాలీవుడ్ నటి ఊర్మిళకు.. ఆర్.ఎస్. ఎస్. చీఫ్ మోహన్ భగవత్ కు ఎటువంటి బంధుత్వం లేదు.