కొత్త పార్లమెంటు భవనం లోపలి భాగాలను చూపించే అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. TATA గ్రూప్ ప్రభుత్వం నుండి కేవలం ఒక రూపాయి మాత్రమే వసూలు చేస్తోందని.. పార్లమెంటును 'దేశానికి బహుమతి'గా నిర్మించిందని చెబుతున్నారు. ఈ 17 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిందని చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
మార్చి 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ ను సమీక్షించారు. ఈ సందర్శన తర్వాత కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించడానికి టాటా గ్రూప్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుందంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ :
17 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి టాటా కంపెనీ ఒక రూపాయి వసూలు చేసిందనే పలు వాదనలు అవాస్తవమని NewsMeter కనుగొంది.
డిసెంబర్ 9, 2021న లోక్‌సభలో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి ప్రతిస్పందన ప్రకారం. కొత్త పార్లమెంట్ భవనం అంచనా వ్యయం రూ. 971 కోట్లు కాగా అక్టోబర్ 2022 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు.
మేము ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. సెప్టెంబరు 2020 నుండి అనేక వార్తా నివేదికలను చూశాము, ఇందులో టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ. 861.90 కోట్లతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించే బిడ్‌ను గెలుచుకున్నట్లు పేర్కొంది. కొత్త పార్లమెంట్ నిర్మాణం సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కిందకి వస్తుందని, 21 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కూడా పేర్కొంది.
కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్‌లను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) చూసుకుంటుందని మింట్ నివేదిక పేర్కొంది.
సవరించిన బడ్జెట్
జనవరి 20, 2022 ఎన్‌డిటివి నివేదిక ప్రకారం.. ఈ నిర్మాణం బడ్జెట్ 29 శాతం పెరిగిందని, దీని అంచనా బడ్జెట్ రూ. 1,250 కోట్లకు పైగా చేరిందని పేర్కొంది.
ఏప్రిల్ 3, 2023న ప్రచురించిన ది ఎకనామిక్స్ టైమ్స్ నివేదికను మేము చూశాము. ఇందులో మోదీ కొత్త పార్లమెంటుకు సంబంధించిన వివిధ పనులను పరిశీలిస్తున్న అనేక చిత్రాలను కలిగి ఉంది. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
కాబట్టి, పార్లమెంటు నిర్మాణానికి అయ్యే ఖర్చు, కాలపరిమితికి సంబంధించిన వాదనలు తప్పు అని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam