FactCheck : సీతారామం సినిమా నిజ జీవితంలో చోటు చేసుకున్నదా?

బ్లాక్ బస్టర్ మూవీ `సీతా రామం' లోని రీల్ జంట నిజంగానే ఉందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2023 9:24 AM GMT
FactCheck : సీతారామం సినిమా నిజ జీవితంలో చోటు చేసుకున్నదా?

బ్లాక్ బస్టర్ మూవీ `సీతా రామం' లోని రీల్ జంట నిజంగానే ఉందంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. చిత్రం రీల్ జంట, పక్కనే ఉన్నది నిజమైన జంట అంటూ వినియోగదారులు షేర్ చేస్తున్నారు.


సీతా రామం సినిమా కథ ఓ అనాథ సైనికుడైన రామ్ చుట్టూ తిరుగుతుంది. సీత అనే అమ్మాయి నుండి ఉత్తరం వచ్చిన తర్వాత అతని జీవితం మారిపోతుంది. రామ్ ఆమెను కలుసుకున్నాక వారి మధ్య ప్రేమ వికసిస్తుంది.. ఆ తర్వాత ఏమి జరిగింది అనే విషయం సినిమాలో చూపించారు. ఈ సినిమా ఒక క్లాసిక్ లా నిలిచింది.

అయితే ఇది నిజంగానే చోటు చేసుకుందా? ఆ ఫోటోలో ఉన్న వాళ్లు నిజమైన రామ్, సీతలా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.

నిజ నిర్ధారణ :

సినిమాలో చూపిన వ్యక్తులకు సంబంధించిన ప్రేమకథకు సంబంధించిన నిజమైన పాత్రల ఫోటోలు అంటూ వైరల్ అవుతున్న వాదన తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది.

సీతా రామం సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ఉందా?

ఇది ఇప్పటికీ ఒక రహస్యం.. కొన్ని వెబ్‌సైట్‌లు ఇది నిజ జీవిత ఘటనల నుండి తీసుకున్నారని చెప్పారు. చాలా వరకూ కల్పితం అని చెప్పుకొచ్చారు. వైరల్ ఫోటోలలో ఉన్న వ్యక్తులకు నిజ జీవిత పాత్రలకు ఏమైనా సంబంధం ఉందో లేదో తెలుసుకుందాం.

మేము వైరల్ ఫోటో నుండి లెఫ్టినెంట్ రామ్ చిత్రాన్ని తీసుకొని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. లెఫ్టినెంట్ రామ్, 'లెఫ్టినెంట్ రామ్ ప్రకాష్ రోపెరియా', భాల్ సింగ్ కుమారుడు, హర్యానాలోని హిస్సార్ జిల్లాలోని పాలి గ్రామంలో 10 జూన్ 1959న జన్మించారని మేము కనుగొన్నాము. ఆయన ఒక ఉగ్రవాది కాల్పుల్లో గాయపడ్డా కూడా ఆ తర్వాత.. ఉగ్రవాదిని మట్టుబెట్టాడు. రెండు బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడినప్పటికీ శత్రువులతో పోరాడారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణానంతరం 'అశోక చక్ర' లభించింది. ఆయన 5/6 జూన్, 1984 రాత్రి మరణించారు.

నూర్ జహాన్ కు సంబంధించిన ఫోటో అంటూ వైరల్ అవుతున్న ఇమేజ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా ఆమె నూర్జహాన్ కాదని.. అసలు భారతదేశానికి చెంది వాళ్లు కాదని మేము కనుగొన్నాము. ఆమె నెస్లీషా సుల్తాన్. ఆమె 1921లో జన్మించింది. ప్రిన్స్ అబ్దెల్ మోనీమ్‌ను వివాహం చేసుకుంది. ఈజిప్టు రాజకుటుంబానికి యువరాణి అయింది. ఆమె 2012లో 91 ఏళ్ల వయసులో మరణించింది.

మేము సేకరించిన సమాచారం ప్రకారం, రెండు పాత్రల మధ్య జననం, మరణం, స్థలం లేదా చరిత్ర కు సంబంధించి ఎలాంటి సారూప్యత లేదు. అందుకే, వీరిద్దరిని నిజజీవిత జంటగా చూపుతున్న వైరల్ చిత్రం నిరాధారమైనదని, నకిలీదని స్పష్టంగా తెలుస్తోంది.

Credits : Sunanda Naik

Claim Review:సీతారామం సినిమా నిజ జీవితంలో చోటు చేసుకున్నదా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Instagram
Claim Fact Check:False
Next Story