ఎలోన్ మస్క్ ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఒక కథనం వైరల్ అవుతోంది.
వైరల్ కథనాన్ని 25 ఫిబ్రవరి 2023న Topad.News24.Info ప్రచురించింది. “బ్రేకింగ్: ఎలోన్ మస్క్ ఫేస్‌బుక్‌ని కొనుగోలు చేస్తున్నట్లు నిర్ధారించాడు.” ఈ వార్త సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారింది.
మస్క్ తన వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టల ద్వారా చాలా సార్లు వార్తల్లో నిలిచారు. ట్విట్టర్‌ని టేకోవర్ చేసిన తర్వాత, అతను ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేయబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కాబట్టి, ఎలోన్ మస్క్ నిజంగా ఫేస్‌బుక్‌ను కొనుగోలు చేస్తున్నారా? అని తెలుసుకోడానికి నెటిజన్లు ఎదురుచూస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
ఈ దావా బూటకమని NewsMeter బృందం కనుగొంది.
కథనాన్ని జాగ్రత్తగా చదవగా, పాఠకులకు ఇది నిజమైన వార్తగా అనిపించేలా కథనాన్ని ప్రచారం చేసినట్లు మేము కనుగొన్నాము. కథనం చివరలో రచయిత ఇలా “ఇది వ్యంగ్యం నిజమైన వార్త కాదని గుర్తుంచుకోండి.” అంటూ చెప్పుకొచ్చారు.
దీన్ని బట్టి, ఆ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రాశారని స్పష్టమవుతుంది.