ఫిబ్రవరి 14, 2021న జర్నలిస్ట్, వాషింగ్టన్ పోస్ట్ గ్లోబల్ ఒపీనియన్ రైటర్ రానా ఆయూబ్ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను విమర్శిస్తూ ఓ పోస్టు చేశారు.
Sachin Tendulkar,a man without any beliefs at all, devoid of any ethical or moral concerns towards the society and country that has so deified and veneratçed him. I think @sachin_rt should certainly read this. Not my Hero అంటూ రానా ఆయూబ్ చేసిన ట్వీట్ సంచలనం అయింది.
మీరు నా హీరో ఎప్పటికీ కాదు అంటూ సచిన్ ను విమర్శిస్తూ రానా ఆయూబ్ పోస్టు చేయడం పెద్ద ఎత్తున సంచలనం అయింది. ఆ ట్వీట్ కు ఏడు వేల రూపాయలకు పైగా లైక్స్ వచ్చాయి.
అయితే రానా ఆయూబ్ కు వ్యతిరేకంగా, సచిన్ టెండూల్కర్ కు మద్దతుగా పలువురు ట్వీట్లు చేశారు.
అయితే ఓ ట్వీట్ మాత్రం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. 'నేను నీ హీరో కాకపోవచ్చు.. కానీ భారతీయులకు హీరోను' అంటూ ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది సచిన్ టెండూల్కర్ చేసినట్లుగా ఉంది.
ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం కూడా గమనించవచ్చు.
నిజ నిర్ధారణ :
సచిన్ టెండూల్కర్ అకౌంట్ నుండి వచ్చిన ట్వీట్ అంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
రానా ఆయూబ్ సచిన్ ను విమర్శిస్తూ చేసిన ట్వీట్ కు సచిన్ టెండూల్కర్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్న అకౌంట్ కు సచిన్ టెండూల్కర్ ఒరిజినల్ ట్విట్టర్ అకౌంట్ కు ఎటువంటి సంబంధం లేదని న్యూస్ మీటర్ గ్రహించింది.
రానా ఆయూబ్ కు రిప్లై ఇచ్చిన ట్వీట్ '@Sachin_rts' అనే ట్విట్టర్ ఖాతా ద్వారా రాగా.. @sachin_rt అన్నది సచిన్ టెండూల్కర్ అధికారిక ట్విట్టర్ ఖాతా.
ఈ వైరల్ స్క్రీన్ షాట్ లో ఉన్న అకౌంట్ ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది కూడానూ..!
ఇక రానా ఆయూబ్ కూడా తన ట్విట్టర్ ఖాతా సెట్టింగ్స్ ను మార్చేశారు. ఆమెను ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో.. వాళ్లు మాత్రమే ట్వీట్ చేయగలరు.
రానా ఆయూబ్ ట్వీట్ కు సచిన్ టెండూల్కర్ సమాధానం ఇచ్చారు అంటూ వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఎటువంటి నిజం లేదు. అదొక ఫేక్ అకౌంట్.