తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు పార్లమెంట్ లో నిద్రపోయారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కృష్ణానగర్ ఎంపీ మహువా మోయిత్రా, జాదవ్‌పూర్ ఎంపీ సయానీ ఘోష్‌లు లోక్‌సభ లో నిద్రపోతున్నట్లుగా కనిపించే దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మహువా మోయిత్రా, సయానీ ఘోష్ లు పార్లమెంట్‌లో నిద్రపోతున్నారని వైరల్ వాదన తెలియజేస్తోంది.
ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని పంచుకుని.. “పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర్ ఎంపీ మహువా మొయిత్రా, జాదవ్‌పూర్ ఎంపీ సయానీ ఘోష్ రాత్రంతా ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తూ గడిపారు. అందుకే పార్లమెంట్‌లోనే పడుకోవాలని నిర్ణయించుకున్నారు. కృష్ణానగర్, జాదవ్‌పూర్ ప్రజలు ఇలాంటి వారిని గెలిపించుకున్నందుకు ఎంతో అదృష్టవంతులు" అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
“Krishnanagar & Jadavpur is sleeping!! (sic)” అంటూ మరో ఎక్స్ వినియోగదారుడు కూడా పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. వైరల్ చిత్రం అనేది ఒరిజినల్ వీడియోలోని ఓ సమయంలో తీసిన స్క్రీన్ షాట్. ఒరిజినల్ వీడియోలో వారు నిద్రపోతున్నట్లుగా చూపదు.
వైరల్ స్క్రీన్‌గ్రాబ్‌లో ముంబై సౌత్ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ అరవింద్ గణపత్ సావంత్‌ను మేము గమనించాము. ఈ క్లూని ఉపయోగించి, మేము సంబంధించిన కీవర్డ్ సెర్చ్‌ని నిర్వహించాము. జూన్ 26, 2024న ‘లోక్‌సభ స్పీకర్‌గా మళ్లీ ఎన్నికైన ఓం బిర్లాకు అరవింద్ గణపత్ సావంత్ అభినందనలు’ అనే శీర్షికతో Sansad TV ప్రచురించిన వీడియోను కనుగొన్నాము. ‘Arvind Ganpat Sawant congratulates Om Birla on being re-elected as Lok Sabha Speaker.’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
వైరల్ స్క్రీన్‌గ్రాబ్ ఈ వీడియో నుండి తీసుకున్నదే. ఒరిజినల్ వీడియోను 1:57 నిమిషాల మార్క్ వద్ద చూడొచ్చు. వీడియోలోని ఈ ఖచ్చితమైన సమయంలో, మోయిత్రా తన తలను పైకెత్తుతున్నప్పుడు, ఘోష్ తలను క్రిందికి తిప్పుతున్నప్పుడు స్క్రీన్ క్యాప్చర్ చేశారు. స్క్రీన్ షాట్ ని ఉద్దేశపూర్వకంగా వారు నిద్రిస్తున్నట్లు అనిపించే సమయంలో తీశారు.
వీడియోలోని అదే పాయింట్ నుండి మేము క్యాప్చర్ చేసిన మొయిత్రా, ఘోష్ కు సంబంధించిన విజువల్స్ తో వైరల్ స్క్రీన్‌గ్రాబ్ పోలికను ఇక్కడ చూడొచ్చు.
మేము జూన్ 26న TV9 మరాఠీ, మహారాష్ట్ర టైమ్స్ ప్రచురించిన సావంత్ అభినందన వీడియోను కూడా కనుగొన్నాము. ఈ వీడియోలలో కూడా ఘోష్, మోయిత్రా నిద్రపోతున్నట్లు చూపించలేదు.
అందువల్ల, వైరల్ స్క్రీన్‌గ్రాబ్ ప్రజలను తప్పుదారి పట్టించేదిగా తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన TMC ఎంపీలు పార్లమెంటులో నిద్రపోతున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.