గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారని చెబుతూ.. కొందరు పసుపు రంగు టీ-షర్టులు ధరించి, రోడ్డు వెంబడి నడుస్తున్న చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఐపీఎల్ ఫైనల్ కు వచ్చిన చెన్నై అభిమానులు, ధోని అభిమానులు అంటూ చెబుతున్నారు.
ఒక ట్విట్టర్ వినియోగదారుడు.. అహ్మదాబాద్‌లో భారీగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తరలి వచ్చారంటూ పోస్టులు పెట్టారు. “Chennai Super Kings fans are crazy on a whole new level at Ahmedabad. #CSKvGT #IPL2023Final.” అంటూ పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మే 28న జరగాల్సిన IPL 2023 ఫైనల్ భారీ వర్షం కారణంగా వాయిదా పడింది. మే 29న రిజర్వ్ డే రోజున నిర్వహించనున్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వైరల్ వీడియోలో ఉన్నది చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కాదు.
ఈ చిత్రం గ్రేట్ ఇథియోపియన్ రన్‌ను చూపుతుందని న్యూస్‌మీటర్ కగుర్తించింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, ఇథియోపియాలోని అడిస్ అబాబాలో 'ది గ్రేట్ ఇథియోపియన్ రన్'ని చూపిస్తూ 2017లో పలువురు ట్విట్టర్ వినియోగదారులు పోస్ట్ చేసిన చిత్రాన్ని మేము కనుగొన్నాము.
మేము 2017 లో CNN ట్రావెల్ పోస్టు చేసిన ఒక కథనాన్ని కూడా కనుగొన్నాము. ఫోటోను ఇథియోపియా టూరిజం సంస్థకు చెందినదని తెలిసింది. "ఆడిస్ అబాబాలో వార్షిక గ్రేట్ ఇథియోపియన్ రన్ పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది." అని పోస్టులు పెట్టారు.
2016లో CNN ప్రచురించిన చిత్రాన్ని కూడా కనుగొన్నాము. ఆడిస్ అబాబాలో వార్షిక గ్రేట్ ఇథియోపియన్ రన్ కు సంబంధించిన ఫోటో అని తెలిసింది.
2015లో ఫేస్‌బుక్ ఖాతా, టాంజిబుల్ ఇథియోపియా టూరిజం & ఎన్విరాన్‌మెంట్ ఫర్ సోషల్ చేంజ్ ద్వారా పోస్ట్ చేసిన చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. “గ్రేట్ ఇథియోపియన్ రన్.. ఆఫ్రికాలోనే అతిపెద్ద రన్నింగ్ ఈవెంట్, ఆఫ్రికా అంతటా, చుట్టుపక్కల 39,000 వేల మంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ ను నిర్వహిస్తారు…” అని క్యాప్షన్ లో ఉంది.
ఈ చిత్రం కనీసం 2015 నాటిదని గుర్తించవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య IPL 2023 ఫైనల్ కోసం అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు వచ్చారనే వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam