FactCheck : ఆర్యన్ ఖాన్ కు స్వాగతం పలకడానికి అంత మంది షారుఖ్ ఖాన్ ఇంటి ముందు హాజరయ్యారా..?

Image Of Large Crowd Outside SRKs House is from 2014. షారుఖ్ ఖాన్ తన అభిమానులకు అభివాదం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2021 11:30 AM IST
FactCheck : ఆర్యన్ ఖాన్ కు స్వాగతం పలకడానికి అంత మంది షారుఖ్ ఖాన్ ఇంటి ముందు హాజరయ్యారా..?

షారుఖ్ ఖాన్ తన అభిమానులకు అభివాదం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పెద్ద ఎత్తున అభిమానులు షారుఖ్ ఖాన్ ఇంటి ముందు గూమికూడి ఉన్నారు. ఈ ఫోటోను అభిమానులు వైరల్ చేస్తూ ఉన్నారు.

షారుఖ్ ఖాన్ భారీ జనసందోహాన్ని పలకరిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్‌కు స్వాగతం పలికేందుకు షారుఖ్ ఖాన్ ఇంటి బయట జనం గుమిగూడారని ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ కేసులో నిందితుడికి ఇంత ఘన స్వాగతం ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఇది ఇప్పటి ఫోటో కాదు.

న్యూస్‌మీటర్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. నవంబర్ 02, 2014న తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ అప్‌లోడ్ చేసిన ట్వీట్‌అని తేలింది. చిత్రంలో షారుఖ్ ఖాన్ వైరల్ ఫోటోలోనికి అదే టీ షర్ట్ మరియు జీన్స్ ధరించి కనిపించాడు.


"So much happiness…so many people to share it with. Hope I am 'enough' to do so…all my life." అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు.

దీన్ని బట్టి మా టీమ్ కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా.. Filmibeat నవంబర్ 03, 2014న పోస్టు చేసిన ఫోటోలను చూడొచ్చు. షారుఖ్ ట్వీట్ చేసిన పోస్టుతో పాటూ మరిన్ని ఫోటోలను పోస్టు చేసింది. "Pics: Shahrukh Khan Fans Celebrate Birthday outside Mannat at Midnight" అంటూ ఫోటోలను పోస్టు చేయడం చూడొచ్చు.

'iDiva' అనే సైట్ లో November 02, 2020 న గత ఏడాది మన్నత్ ముందు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సమయంలో ఎటువంటి సందడి లేదనే విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది కరోనా కారణంగా తన పుట్టినరోజు వేడుకలకు మన్నత్ దగ్గరకు ఎవరూ రావద్దని షారుఖ్ ఖాన్ కోరారు.

Pinterest కూడా ఈ ఫోటోలను చూడొచ్చు. ఈ ఫోటోలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నవి కాదని స్పష్టంగా తెలుస్తోంది.



Economics Times ప్రకారం ఇటీవల ఆర్యన్ ఖాన్ జైలు నుండి విడుదలైనప్పుడు పెద్ద ఎత్తున షారుఖ్ ఖాన్ అభిమానులు ఆయన ఇంటి ముందు నిలిచారు.

కాబట్టి షారుఖ్ ఖాన్ మన్నత్ ముందు అభిమానులు సందడి చేస్తున్న ఫోటోలు 'ఇప్పటివి కావు'.. 2014 సంవత్సరంలోనిది. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.




Claim Review:ఆర్యన్ ఖాన్ కు స్వాగతం పలకడానికి అంత మంది షారుఖ్ ఖాన్ ఇంటి ముందు హాజరయ్యారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter Users
Claim Fact Check:False
Next Story