FactCheck : ఓనం పండుగ సందర్భంగా ట్రైన్ ను ఇంత అందంగా ముస్తాబు చేశారా?

కేరళలో ఓనం వేడుకలలో భాగంగా రంగు రంగుల పూలతో అలంకరించిన రైల్వే లైన్, పూల బొమ్మలతో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Aug 2023 3:45 PM GMT
FactCheck : ఓనం పండుగ సందర్భంగా ట్రైన్ ను ఇంత అందంగా ముస్తాబు చేశారా?

కేరళలో ఓనం వేడుకలలో భాగంగా రంగు రంగుల పూలతో అలంకరించిన రైల్వే లైన్, పూల బొమ్మలతో నిండిన రైలును చూపించే ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు., “ఇది ఓనం కోసం ప్రత్యేకంగా అలంకరించిన కేరళలోని రైల్వే స్టేషన్ కు సంబంధించిన చిత్రం. ట్రాక్‌ల దగ్గర ఉన్న పువ్వులు నిజమైనవి. పండుగ సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఓనం జరుపుకుంటారు. (sic)” అంటూ పోస్టులో తెలిపారు.

నిజ నిర్ధారణ :

AI సాధనం మిడ్‌జర్నీని ఉపయోగించి ఈ చిత్రం రూపొందించారని NewsMeter బృందం కనుగొంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, జూలై 29న ఫేస్‌బుక్ యూజర్ అనీష్ చక్కోటిల్ పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. క్యాప్షన్‌లో అతను రైలు కాసరగోడ్ నుండి త్రివేండ్రం వరకు ఓనం స్పెషల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అని రాశారు. దీనిపై స్పందిస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన బదులిచ్చారు.

మేము అనీష్ చక్కోటిల్ ను సంప్రదించాం. AI టూల్ మిడ్‌జర్నీ, ఫోటోషాప్‌ని ఉపయోగించి చిత్రం రూపొందించామని అతను ధృవీకరించాడు. అతను "చిత్రంలో కనిపించే విధంగా నా దేశం అభివృద్ధిని నేను చూడాలనుకుంటున్నాను." అని అన్నారు. చక్కోటిల్ కేరళకు చెందినవారు. ఆయన ప్రస్తుతం యూఏఈలో ఉన్నారు. కాపర్ అండ్ బ్లాక్ అడ్వర్టైజింగ్ అనే యాడ్ ఏజెన్సీని నడుపుతున్నారు.

తిరువనంతపురం డివిజనల్ రైల్వే మేనేజర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ అదొక ఫేక్ పోస్ట్ అని అన్నారు. అందులో “ఫేక్ న్యూస్ అలర్ట్! కేరళలోని ఒక రైల్వే స్టేషన్ లో కలర్‌ఫుల్ రైలు కు సంబంధించిన ఎడిట్ చేసిన చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. చిత్రంలో ఉన్న రైలు జపాన్‌లోని క్యోటో కు సంబంధించినది. తప్పుడు వార్తల జోలికి పోకండి!'' అని ఉంది.

మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. జపాన్‌లో పెయింట్ చేసిన రైళ్లు సర్వసాధారణమని కనుగొన్నాము.

అందుకే, ఈ చిత్రం కేరళకు చెందినది కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.

Credits : Md Mahfooz Alam

Claim Review:ఓనం పండుగ సందర్భంగా ట్రైన్ ను ఇంత అందంగా ముస్తాబు చేశారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Fact Check:False
Next Story