గడ్డంతో ఉన్న వ్యక్తితో హిందూ సాధ్వి పక్కనే ఉన్నట్లుగా.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సాధ్వి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారనే వాదనలతో పోస్టులు పెడుతున్నారు.
హిందూ సాధ్వి ప్రాపంచిక జీవితాన్ని త్యజించి ఉంటారు. అలాంటి వాళ్లు పెళ్లికి దూరంగా ఉంటారు.
ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని షేర్ చేసి, “అంధ భక్తులారా, మీ కొత్త బావగారికి అభినందనలు. సాధ్వి రష్మిక నయీమ్ ముస్లింను పెళ్లాడింది. సాధ్వి రష్మికకు వివాహ శుభాకాంక్షలు" అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న చిత్రం ఎడిట్ చేశారని.. అందుకే ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది. అసలు ఫోటోలో ‘మహిళ’కి బదులుగా జైపూర్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్య ఉన్నారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా.. జైపూర్‌లోని హవా మహల్ నియోజకవర్గం నుండి బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే అయిన బల్ముకుంద్ ఆచార్య చిత్రాన్ని పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఆచార్య డిసెంబర్ 6, 2023న తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ఎన్నికల తర్వాత ఆయన ఆఫీసులో ఈ చిత్రాన్ని తీశారు.
అసలు, ఎడిట్ చేసిన చిత్రాల మధ్య పోలిక ఇక్కడ చూడొచ్చు..
డిసెంబరు 5, 2023న ఆచార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన అనేక ఫోటోలలో టోపీ ధరించిన వ్యక్తి ఉన్నట్లు కూడా మేము కనుగొన్నాము. ఆచార్య విజయం సాధించినందుకు వివిధ సంస్థల ముస్లిం కమ్యూనిటీ ప్రజలు స్వాగతించారని, అభినందించారని తెలిపారు.
MyNeta వెబ్‌సైట్ ప్రకారం, 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాజస్థాన్‌లోని హవా మహల్ నియోజకవర్గం నుండి బల్ముకుంద్ ఆచార్య అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.
అందువల్ల, వైరల్ చిత్రం ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము. హిందూ సాధ్వి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు చూపుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.