భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! చాలా ప్రాంతాల్లో దహనసంస్కారాలకు చాలా సమయం పడుతోంది. ఇంకొన్ని ప్రాంతాల్లో దహన సంస్కారాలకు స్థలాలు కూడా దొరకడం లేదు.

ఇలాంటి సమయంలో ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. అక్కడే భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ హోర్డింగ్ కూడా ఉంది. #श्मशानमंत्रीमोदी అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి పలువురు ఈ ఫోటోను షేర్ చేశారు. కరోనాతో చనిపోయిన వారికి దహన సంస్కారాలను నిర్వహించడానికి కనీసం స్థలం కూడా దొరకలేదంటూ ఈ ట్విట్టర్ లో ట్వీట్లు చేశారు.

ఈ ట్వీట్ కు 800కు పైగా లైక్ లు రావడమే కాకుండా 600కు పైగా రీట్వీట్లు చేయబడ్డాయి. #श्मशानमंत्रीमोदी (శ్మశాన మంత్రి మోదీ) అంటూ పలువురు ఈ ఫోటోను షేర్ చేశారు.


నిజనిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోలో ఎటువంటి నిజం లేదు. రెండు ఫోటోలను కలిపి వైరల్ అవుతున్న ఫోటోగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

హెల్త్ కేర్ ఉద్యోగులు పీపీఈ కిట్లతో ఉన్న ఫోటో వేరేదిగా చెప్పొచ్చు. మరొక ఫోటో ఇతర ఫోటో.. ఈ రెండింటినీ ఎడిట్ చేసి మోదీ హోర్డింగ్ కింద దహనసంస్కారాలు చేస్తున్నట్లుగా పోస్టులు పెట్టారు. ఒరిజినల్ ఫోటోలోనూ ఎడిట్ చేసిన ఫోటోను తీక్షణంగా పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది.


శ్మశానవాటికకు సంబంధించిన ఫోటోను పలు మీడియా సంస్థలు పోస్టు చేశాయి. కోవిడ్-19 కారణంగా మరణిస్తూ ఉన్న వారికి సంబంధించిన సమాచారం తెలియజేస్తూ పలు మీడియా సంస్థలు ఈ ఫోటోను ఉపయోగించాయి.

న్యూస్ మీటర్ ఈ ఫోటోకు సంబంధించిన లింక్ ను కూడా తెలుసుకుంది. NDTV లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోవిద్-19 మరణాలకు సంబంధించిన సమాచారం సరిగా ఇవ్వడం లేదంటూ కథనాన్ని తెలియజేసే సమయంలో సదరు శ్మశానవాటిక ఫోటోనే వాడింది. వైరల్ అవుతున్న ఫోటోలో ఈ శ్మశానవాటిక ఫోటోనే ఉపయోగించారు. ఎక్కడా కూడా మోదీ ఉన్న హోర్డింగ్ కనిపించలేదు. బీజేపీ గతంలో చేసిన ట్వీట్ నుండి మోదీ ఫోటోను తీసుకుని ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.


https://www.indiatoday.in/india/story/4-years-of-modi-sarkar-report-card-of-promises-kept-and-missed-1241499-2018-05-25

నరేంద్ర మోదీ హోర్డింగ్ కింద మృతదేహాలను ఖననం చేస్తున్నట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


Claim Review :   నరేంద్ర మోదీ భారీ హోర్డింగ్ ముందే శవాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తూ ఉన్నారా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

సామ్రాట్

Next Story