వరదనీటిలో ఓ అమ్మాయి కుక్క పిల్లను ఓ గిన్నెలో ఉంచి కాపాడుతున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
ఈ ఫోటోను చూసి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓ వైపు వరద నీరు ఉన్నా.. చిన్న కుక్కపిల్లను కాపాడడానికి ఆమె ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్ మీటర్ వైరల్ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 'Global Giving' అనే వెబ్సైట్ కు సంబంధించిన లింక్ కనిపించింది.
'Flickr' వెబ్సైట్ లో కూడా ఇందుకు సంబంధించిన సమాచారం ఉంది. ఈ ఫోటో ఇప్పటిది కాదని స్పష్టంగా వివరణ ఇచ్చారు. 2009లో వియత్నాంలో తీసిన ఫోటో.
"VN Express" డిజిటల్ పేపర్ లో ఈ ఫోటోను పబ్లిష్ చేశారు. దక్షిణ వియత్నాం లోని హౌ జియాంగ్ ప్రావిన్స్ లో అప్పుడు భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో ఓ బాలిక తన పెంపుడు కుక్కను ఇలా గిన్నెలో ఉంచి రక్షించింది.
ఈ ఫోటోకు.. ఇటీవల మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకున్న ప్రకృతి ప్రకోపానికి ఎటువంటి సంబంధం లేదు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. బాలిక కుక్కపిల్లను కాపాడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకోలేదు.