భువనేశ్వరి ఆడియో: ఎవరు సృష్టించారు.. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతోంది ఇదే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 April 2024 10:53 AM GMT
Nara Bhuvaneshwari, Chandrababu, TDP, YS Jagan, AI, MCA

భువనేశ్వరి ఆడియో: ఎవరు సృష్టించారు.. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతోంది ఇదే  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. భువనేశ్వరి దళితులను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ జగన్ ట్రెండ్స్ అనే ఎక్స్ ప్రీమియం హ్యాండిల్ వీడియోను షేర్ చేసింది.

భువనేశ్వరి దళిత సమాజాన్ని అవమానించారని పలువురు వైరల్ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ప్రజలు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆడియో డీప్‌ఫేక్ అని తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్ క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గం నకిలీ ఆడియోను సృష్టించారని టీడీపీ అధికారిక హ్యాండిల్ ఆరోపించింది.

సీఎం జగన్ నకిలీ ఆడియోను రూపొందించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భువనేశ్వరి తనయుడు నారా లోకేశ్ ఆరోపించారు. తన తల్లి పరువు తీయడానికి కూడా దిగజారాడని సీఎం జగన్‌పై నారా లోకేష్ మండిపడ్డారు.

ఆ ఆడియోలో ఏమి ఉంది?

57 సెకన్ల నిడివి గల ఆడియోలో ఓ మహిళ గొంతు వినిపించింది. ఆడియోలో కొంత మంది వ్యక్తులపై ఆమె కోపంగా మాట్లాడుతూ ఉండడం వినవచ్చు. తాను పెద్ద ఇంట్లో పుట్టానని ఆమె చెబుతూ.. మిగిలిన వాళ్లను తిట్టడం ఆ ఆడియోలో వినవచ్చు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆమె తిడుతూ ఉన్నారు. అయితే అందులో 'దళిత' అనే పదం ఎత్తలేదు. ఈ ఇంట్లో అన్నీ తానే చూసుకోవాలా అన్నట్లుగా ఆ ఆడియోలో ఓ మహిళ కోప్పడుతూ ఉండడం మనం వినవచ్చు.

వీడియో చివర్లో, ఒక వ్యక్తి హాలులో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. సౌండ్ అకౌస్టిక్స్‌లో తీవ్రమైన మార్పును వినవచ్చు. ఆడియో టింకర్ చేసి ఉండవచ్చని మనం గమనించవచ్చు.

ఆడియోని విన్న నిపుణులు ఏమని వివరణ ఇస్తున్నారు?

తప్పుడు సమాచార పోరాట కూటమి (MCA) లో న్యూస్‌మీటర్‌ కూడా ఒక భాగమే. ఈ కూటమి సభ్యులలో భాగంగా ఉన్న డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్ (DAU) ద్వారా ఆడియోను విశ్లేషించారు.

డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్ (DAU) ఆడియోను డాక్టర్ హనీ ఫరీద్ ఫోరెన్సిక్ ల్యాబ్ అండ్ కాంట్రైల్స్‌ఏఐతో సహా దాని నిపుణులైన భాగస్వాములకు ఫార్వర్డ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఆడియో రూపొందించలేదని నిర్ధారించారు.

డాక్టర్ హనీ ఫరీద్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. బర్కిలీ వెబ్‌సైట్ ప్రకారం ఈ ఆడియోను డీప్ ఫేక్ ద్వారా రూపొందించలేదని మేము గుర్తించాం. ఆడియోలోని ఉచ్చారణ, స్వరం ఏఐగా అనిపించలేదని ఫరీద్ ల్యాబ్ ధృవీకరించింది. AI ద్వారా రూపొందించిన ఆడియో కోపంతో మాట్లాడడం.. దూకుడుగా ఉండడం వంటి బలమైన భావోద్వేగాలను అనుకరించదని తెలిపారు. అంతేకాకుండా ఆ ఆడియో నారా భువనేశ్వరిదేనని ల్యాబ్ కూడా నిర్ధారించలేదు.

ContrailsAI, బెంగళూరు ఆధారిత స్టార్టప్, దాని స్వంత మల్టీమోడల్ A.I. ఇమేజ్‌లు, ఆడియో, వీడియో డీప్‌ఫేక్‌లను గుర్తించే సాధనాలతో వివిధ తెలుగు రాజకీయ నాయకుల ఆడియో క్లోన్‌లను గుర్తిస్తుంది. ఈ సంస్థ కూడా ఆడియోను పరిశీలించింది. భువనేశ్వరి ఆడియో అంటూ వైరల్ అవుతున్న ఫైల్ లో ఆడియో క్లోన్‌లు, వాయిస్ క్వాలిటీ, ఇంటొనేషన్‌ లు లేవని ContrailsAI సంస్థ కనుగొంది. మరిన్ని పరిశీలనలు చేయగా.. ఇది చాలావరకు నిజమైనది కాదని.. డీప్‌ఫేక్ అనే నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది.

ఆడియోలో మాట్లాడింది.. వాయిస్ ఫైల్ గుర్తింపు నిర్ధారణ లేదు

అయితే.. వైరల్ వీడియో నారా భువనేశ్వరిదేనని ప్రయోగశాల కానీ.. టెక్ స్టార్టప్ కానీ ధృవీకరించలేదు. ఇది డిజిటల్ ఫ్యాబ్రికేషన్ కేసు కావచ్చు. మరొక మహిళకు చెందిన ఆడియోను భువనేశ్వరికి తప్పుగా ఆపాదించే అవకాశం కూడా ఉంది. NewsMeter కూడా ఆడియో మూలాన్ని, స్పీకర్ గుర్తింపును స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.

Next Story